నాలుగు కోళ్లను మింగిన నల్ల తాచు
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:29 AM
అమలాపురం రూరల్, జూలై 20(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనుపల్లి బాలయోగి ఘాట్ సమీపంలో మారిశెట్టి నాగభూషణం ఇంటి ఆవరణలో ఉన్న పాడుబడిన బాత్‌రూమ్‌లో ఉన్న నాలుగు కోడిపిల్లలను ఆరు అడుగుల నల్లతాచు ఆదివారం మింగేసింది. కోళ్లు చేస్తున్న

అమలాపురం రూరల్, జూలై 20(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనుపల్లి బాలయోగి ఘాట్ సమీపంలో మారిశెట్టి నాగభూషణం ఇంటి ఆవరణలో ఉన్న పాడుబడిన బాత్‌రూమ్‌లో ఉన్న నాలుగు కోడిపిల్లలను ఆరు అడుగుల నల్లతాచు ఆదివారం మింగేసింది. కోళ్లు చేస్తున్న శబ్ధాన్ని గుర్తించిన ఆ కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లేసరికి కోళ్లు కనిపించకపోగా నల్లతాచు కదలలేని స్థితిలో ఉండడాన్ని గుర్తించారు. వెంటనే బాత్‌రూమ్‌కు గడియవేశారు. వెంటనే భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్‌వర్మకు సమాచారం అందించారు. కోళ్లను మింగిన తాచు కోడిపిల్లలను జీర్ణించుకోలేక ఒక్కొక్కటిగా ఆ బాత్‌రూమ్‌లోనే కక్కేసింది. అక్కడు చేరుకున్న వర్మ తాచుపామును చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టాడు.