క్షణాల్లో ఘోరం.. విషాదం
ABN , Publish Date - Jul 20 , 2025 | 12:39 AM
ముమ్మిడివరం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): 216 జాతీయ రహదారి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి పంచాయతీ లక్ష్మీదేవిలంక సమీపంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు జై బుద్ధనగర్‌కు చెందిన పచ్చిమాల ల

ఆటోను ఢీకొన్న మోటారు సైకిల్
తెగిపడిన మహిళ తల
యువకుడు మృతి
కోనసీమ జిల్లా ముమ్మిడివరం
మండలం లక్ష్మీదేవిలంక సమీపంలో ఘటన
ముమ్మిడివరం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): 216 జాతీయ రహదారి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి పంచాయతీ లక్ష్మీదేవిలంక సమీపంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు జై బుద్ధనగర్‌కు చెందిన పచ్చిమాల లక్ష్మి (49) ముమ్మిడివరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించి ఇంటికి వెళ్లేందుకు ముమ్మిడివరం మార్కెట్ సెంటర్‌లో ఆటో ఎక్కింది. ఆటోలో మహిళతో పాటు వృద్ధుడు, మరో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఆటో మురమళ్ల వైపు బయలుదేరింది. ఇంతలో ఆటో ధాన్యం లోడుతో వెళ్తు న్న ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా లక్ష్మీదేవిలంక సమీపంలో యానాం వైపు నుంచి మోటారు సైకిల్‌పై వస్తున్న బొడ్డు రాంబాబు (24) ఆటోను ఢీకొన్నాడు. దీంతో ఆటోలో ఉన్న లక్ష్మి రోడ్డుపై పడింది. ఆటో వెనుక వస్తున్న ధాన్యం లోడు ట్రాక్టరు ఆమె మెడ భాగం పై నుంచి వెళ్లడంతో తల భాగం తెగి 3 మీటర్ల దూరంలో పడగా శరీర భాగాలు ను జ్జునుజ్జు అయ్యాయి. రాంబాబు తీవ్రంగా గాయపడగా హైవే వాహనంపై అమలాపురం ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. ఆటోలో ఉన్న వృద్ధుడు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ ఎం.మోహన్‌కుమార్, ఎస్‌ఐ డి.జ్వాలాసాగర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా పచ్చిమాల లక్ష్మికి భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దిరుసుమర్రు శివారు పల్లిపాలేనికి చెందిన బొడ్డు రాంబాబు యానాం ప్రైవేటు ట్రావెల్స్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం యానాంలో విధులు ముగించుకుని తిరిగి మోటారుసైకిల్‌పై వస్తుండగా ఈ ప్రమా దంలో కన్నుమూశాడు. ఇద్దరు మరణించడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.