Share News

ప్రిపరేషన్‌!

ABN , Publish Date - Jul 19 , 2025 | 01:44 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు భారీగా వెల్లువెత్తాయి. గత వైసీపీ హయాంలో కొత్త కార్డుల జారీ లేక పోవడంతో వేలాది మంది పేదలు ఈసురోమ న్నారు. రకరకాల కారణాలతో ఉన్న కార్డులను సైతం భారీగా అప్పట్లో ఏరేశారు. దీంతో ప్రభు త్వం మారాక కార్డుల జారీకి నిర్ణయించడంతో ఇప్పటి వరకు 1.53 లక్షల మంది అర్జీలు అం దించారు. ఇందులో ఏకంగా 1.10 లక్షల మంది తమకు ఉన్న కార్డుల్లో అదనపు సభ్యులను చేర్చా

ప్రిపరేషన్‌!

రైస్‌ కార్డులకు.. రైట్‌ రైట్‌

రేషన్‌కార్డులకు దరఖాస్తుల వెల్లువ

ఉమ్మడిగా 1,53,341 వినతులు

వైసీపీలో కార్డుల్లో కోత

కూటమి ప్రభుత్వంలో అవకాశం

భారీగా వెల్లువెత్తిన విజ్ఞప్తులు

చేర్పులకు 1,10,587 దరఖాస్తులు

అధికారుల గ్రీన్‌సిగ్నల్‌

ఏటీఏం కార్డులా రైస్‌ కార్డులు

(కాకినాడ- ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు భారీగా వెల్లువెత్తాయి. గత వైసీపీ హయాంలో కొత్త కార్డుల జారీ లేక పోవడంతో వేలాది మంది పేదలు ఈసురోమ న్నారు. రకరకాల కారణాలతో ఉన్న కార్డులను సైతం భారీగా అప్పట్లో ఏరేశారు. దీంతో ప్రభు త్వం మారాక కార్డుల జారీకి నిర్ణయించడంతో ఇప్పటి వరకు 1.53 లక్షల మంది అర్జీలు అం దించారు. ఇందులో ఏకంగా 1.10 లక్షల మంది తమకు ఉన్న కార్డుల్లో అదనపు సభ్యులను చేర్చాలంటూ దరఖాస్తులు ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి దాదాపుగా ప చ్చజెండా ఊపారు. త్వరలోనే లబ్ధిదారులకు ప్ర భుత్వం కొత్తకార్డులను మంజూరు చేయనుంది.

నాడు ఉన్నవీ పీకేశారు..

గత వైసీపీ పాలనలో సంక్షేమ పథకాల అ మలు పేరుతో ఎడాపెడా లబ్ధిదారులను కోసే శారు. రకరకాల నిబంధనల పేరుతో రేషన్‌కా ర్డులను భారీగా ఏరేశారు. ఉమ్మడి జిల్లాలో అప్పట్లో 16.50 లక్షల రేషన్‌కార్డులుండగా అం దులో తెల్లకార్డులు 15.69 లక్షలు ఉండేవి. వీటి లో అనర్హులు అధికంగా ఉన్నారని భావించిన అప్పటి ప్రభుత్వం అమరావతి నుంచి 28,500 మంది కార్డుదారుల పేరుతో జాబితాను జిల్లా పౌరసరఫరాల శాఖకు పంపి గుట్టుగా క్షేత్రస్థాయి తనిఖీలు చేసి అందరి కార్డులు రద్దు చేయాలని ఆదేశించింది. 17,500 మంది కార్డు దారులు సొంత గ్రామాల్లో నివసించడం లేదనే కారణంతో వాటిని రద్దుచేసేశారు. దీంతో ప్రతి పక్ష హోదాలో నాడు టీడీపీ ఆందోళన బాట పట్టింది. కార్డులను అడ్డగోలుగా ఏరివేయడంపై నిరసనలు చేపట్టింది.అయితే ప్రభుత్వం మారిన తర్వాత సీఎం చంద్రబాబు కార్డుదారుల కష్టా లను పరిష్కరించాలని అధికారులను ఆదేశిం చారు.రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేప ట్టడానికి పచ్చజెండా ఊపారు. దీంతో గత మే 14 నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సచివాల యాల పరిధిలో రేషన్‌కార్డులకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొత్తగా వివాహమైనవారు, ఇప్పటివరకు రేషన్‌ కార్డు లేనివారు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు, చేర్పులు, ఆధార్‌ తప్పుగా నమోదైనవారు ఇలా ఏడు రకాల సేవలకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది.

1,53,341 అర్జీలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఇప్పటివరకు 1,53,341 మంది నుంచి అర్జీలు వచ్చాయి. కొత్తకార్డులు కావాలంటూ 14,197 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఉన్న కార్డు ల్లో కొత్తగా సభ్యులను చేర్చాలంటూ 1,10,587 మంది విజ్ఞప్తులు చేశారు. వచ్చిన అర్జీల్లో అత్య ధికంగా కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చాలంటూ కోరినవే ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన మొత్తం అర్జీల్లో 90 శాతానికిపైగా అధి కారులు క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు అన్ని అర్జీలను అధికారు లు పరిగణనలోకి తీసుకుని ప్ర భుత్వానికి జాబితా కూడా పంపా రు. త్వరలో కొత్త కార్డుల జారీ చేయడానికి వీలుగా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీంతో త్వరలోనే కార్డులు అందుతాయి.

ఇక డిజిటల్‌ కార్డులు

చంద్రబాబు అంటేనే ఐటీ ముఖ్యమంత్రి అంటారు.. ప్రస్తుతం రేషన్‌ కార్డుల్లోనూ ఆ మార్పు చూపిస్తున్నారు. త్వరలో ఇవ్వనున్న కొత్త రేషన్‌కార్డులను రైస్‌ కార్డుల పేరిట ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇవి పూర్తిగా ఏటీఏం కార్డు తరహాలో కొత్తగా డిజైన్‌ చేశారు. వీటికి క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంటుంది. రేషన్‌ దుకాణంలో సరుకులు తీసుకున్న తర్వాత డీలర్‌ సేవలపై క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ప్రభుత్వానికి కార్డుదారులు తమ అభిప్రాయాలు కూడా తెలపవచ్చు.

ఏ జిల్లాకు ఎన్ని..

కాకినాడ జిల్లా నుంచి 62,988 మంది ఉ న్నారు. ఉన్న కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్చాలని 46,729 మంది, రేషన్‌కార్డు విభజించాలని 6,091, కొత్త కార్డులకు 5,170, చిరునామా మార్పునకు 1,986 మంది అర్జీలు అందించారు.

కోనసీమలో మొత్తం 45,080 దరఖాస్తులు రాగా చిరునామా మార్పునకు 1,751, కొత్త సభ్యులను చేర్చాలంటూ 32,254 పేర్లు రద్దుకు 1,275 కొత్తకార్డులకు 4,268, కార్డు విభజించాలని 4,536 అర్జీలు వచ్చాయి.

తూర్పుగోదావరి జిల్లా నుంచి 45,273 అర్జీలు వచ్చాయి. తమ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలంటూ 31,604 మంది మొర పెట్టుకున్నారు. కార్డులు విభజించాలంటూ 4,664 మంది, కొత్త కార్డులు కావాలని 4,759 మంది అర్జీలు అందించారు.

Updated Date - Jul 19 , 2025 | 01:44 AM