చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్‌ల ఏర్పాటు
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:46 AM
బిక్కవోలు, మార్చి 8(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్త నుంచి విద్యుత్ తయా రు చేసే ప్లాంట్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దీనిలో భాగంగా ప్లాంట్ నిర్మాణం కోసం

మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ
కాపవరం, బలభద్రపురం గ్రామాల్లో భూముల పరిశీలన
బిక్కవోలు, మార్చి 8(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్త నుంచి విద్యుత్ తయా రు చేసే ప్లాంట్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దీనిలో భాగంగా ప్లాంట్ నిర్మాణం కోసం తూ ర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కాపవరం శివార్లలో జిల్లా పరిషత్‌కు సంబంధించిన 12 ఎకరాల భూములను, బలభద్రపురంలోని ఏపీ ఇండస్ట్రీయల్ భూములు 34 ఎకరాలను ఆయ న శనివారం పరిశీలించి మాట్లాడుతూ రాజమహేంద్రవరం- కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు చుట్టు పక్కల మున్సిపాలిటీల నుంచి చెత్తను కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్‌కు తరలించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా ప్లాంట్ ఏర్పాటుకు బలభద్రపురం, కాపవరం గ్రామాల్లోని జడ్పీ, ఏపీ ఇండస్ట్రీయల్ భూములను పరిశీలించినట్టు చెప్పారు. ప్లాంట్ ఏర్పాటుకు అనువైన పరిస్థితులను తహశీల్దార్ సత్యకృష్ణ, రాజమహేంద్రవరం మున్సిపాలిటీ ఈఈ-2 మాధవిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ ప్లాంట్ ఏర్పాటు చేసే క్ర మంలో చుట్టు పక్కల మున్సిపాలిటీలకు అను కూలంగా ఉండేలా స్థలాన్ని అన్వేషిస్తున్నామని, అందుకు మున్సిపల్ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచ నలతో స్వచ్ఛ ఆంధ్ర సాధన దిశగా కసరత్తు జరుగుతోందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే ప్లాం ట్‌లో 20 మున్సిపాలిటీల నుంచి సేకరించిన వ్యర్ధాల నుంచి సంపద సృష్టి, విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్టు మంత్రి నారాయణ వివరించారు.