జయమేది!
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:43 AM
రూ.582 కోట్ల జయలక్ష్మి సొసైటీ స్కాం బాధి తులకు న్యాయం కనుచూపు మేరలో కనిపించ డం లేదు. సీజ్ చేసిన ఆస్తులు వేలం వేసి న్యా యం చేసేందుకు సీఐడీ ప్రయత్నించడం లేదు. పదే పదే కేసులో వాయిదాలు కోరుతూ బాధితు లను ముప్పుతిప్పలు పెడుతోంది. స్కాం సమ యంలో సీజ్ చేసిన రూ.5.50 కోట్ల నగదు విడు దల చేయాల్సి ఉన్నా అదీ చేయడంలేదు. తాజా గా సొసైటీకి రుణ వసూళ్లు కింద జమయిన రూ.7.50 కోట్లు సీఐడీ ఏకంగా ఫ్రీజ్ చేసేసింది. వీటిని బాధితులు పంచుకోకుండా అకౌంట్లు స్తంభింపచేసింది. అదే సమయం
నేటికీ తేలని జయలక్ష్మి సొసైటీ కేసు
మూడున్నరేళ్లుగా సాగదీత
ఎటూ తేల్చని సీఐడీ
వాయిదాలతో కాలయాపన
రూ.450 కోట్ల ఆస్తులు సీజ్
వేలంపై ఎడతెగని జాప్యం
తాజాగా అకౌంట్లలో నగదు సీజ్
43 కేసులు దాఖలు
(కాకినాడ- ఆంధ్రజ్యోతి)
రూ.582 కోట్ల జయలక్ష్మి సొసైటీ స్కాం బాధి తులకు న్యాయం కనుచూపు మేరలో కనిపించ డం లేదు. సీజ్ చేసిన ఆస్తులు వేలం వేసి న్యా యం చేసేందుకు సీఐడీ ప్రయత్నించడం లేదు. పదే పదే కేసులో వాయిదాలు కోరుతూ బాధితు లను ముప్పుతిప్పలు పెడుతోంది. స్కాం సమ యంలో సీజ్ చేసిన రూ.5.50 కోట్ల నగదు విడు దల చేయాల్సి ఉన్నా అదీ చేయడంలేదు. తాజా గా సొసైటీకి రుణ వసూళ్లు కింద జమయిన రూ.7.50 కోట్లు సీఐడీ ఏకంగా ఫ్రీజ్ చేసేసింది. వీటిని బాధితులు పంచుకోకుండా అకౌంట్లు స్తంభింపచేసింది. అదే సమయంలో పులిమీద పుట్రలా స్కాంకు ముందు నిందితులు జరిపిన లావాదేవీల ఆధారంగా రూ.15 కోట్లు పన్ను చెల్లించాలంటూ ఐటీ శాఖ ప్రస్తుత సొసైటీకి ఇటీవల నోటీసులు జారీచేసి షాక్ ఇచ్చింది. నిందితుల ఆస్తులు వేలం వేసి డబ్బులు ఇవ్వా లని విజయవాడ కోపరేటివ్ ట్రిబ్యునల్ కేసులూ కొలిక్కిరావడం లేదు. ఇప్పట్లో న్యాయం జరిగే అవకాశాలు క్రమేపీ క్షీణించుకుపోతుండడంతో చిన్న డిపాజిటర్లు లబోదిబోమంటున్నారు. ప్రభు త్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఆ డబ్బూ సీజ్...
సీజ్ చేసిన ఆస్తుల వేలానికి సీఐడీ చొరవ చూపకపోగా.. గతంలో సీజ్ చేసిన రూ.5.50 కోట్లు విడుదల చేయడానికి సీఐడీ ఆసక్తి చూప డం లేదు. తాజాగా సొసైటీకి మరోషాక్ ఇచ్చిం ది. కుంభకోణం తర్వాత ఏర్పడ్డ కొత్త పాలకవ ర్గం రుణాలు తీసుకున్న వారిని గుర్తించి రూ. 7.50 కోట్లు రాబట్టింది. దీంతో చిన్న డిపాజిట ర్లకు చెల్లించి న్యాయం చేస్తారని భావించారు. కానీ ఈలోపు సీఐడీ షాక్ ఇచ్చింది. కొన్ని రో జుల కిందట ఈ నగదును సీజ్ చేసేసింది. దీంతో ఇప్పుడు బాధితులు లబోదిబోమంటున్నా రు. మరోపక్క కుంభకోణానికి ముందు నింది తులు రెండు పాన్ కార్డులు వినియోగించారు. ఒకటి ఇప్పటికీ నడుస్తుండగా.. మరొకటి విని యోగంలో లేదు. 2017-2018 నాటి సొసైటీ కోట్ల రూపాయల లావాదేవీల ఆధారంగా ఇప్పు డు రూ.15 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాలం టూ ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఇప్పుడున్న పాలకవర్గానికి షాక్ తగిలినట్లయిం ది. ఒకపక్క సీఐడీ, మరోపక్క ఐటీ నుంచి ముప్పేట దాడి జరుగుతుండడంతో ప్రస్తుతం పాలకవర్గం నెత్తీనోరు బాదుకుంటోంది.
మూడున్నరేళ్లు దాటేసినా..
కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం జంక్షన్ ప్రధాన కేంద్రంగా ది జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరిట ఎన్నో ఏళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది డిపా జిటర్లు ఇందులో డబ్బులు పొదుపు చేశారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో 29 బ్రాంచీల ద్వారా 20 వేల మంది నుంచి రూ.582 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించి 2022 ఏప్రిల్ 6న బిచాణా ఎత్తేసింది. బాధితులు రోడ్డెక్కడంతో ప్రభుత్వం సీబీసీఐడీ విచా రణకు ఆదేశించింది. కేసు విచారణలో భాగంగా కుంభకోణానికి ప్రధాన సూత్రదారులైన జయలక్ష్మి సొసైటీ చైర్మన్ రాయవరపు సీతారామాంజనేయులు, వైస్ చైర్మన్ రాయవరపు బదరీ విశాలాక్షి, డైరెక్టర్లు రాయవరపు జయమణి, చక్రభాస్కరరావు, ప్రబల మల్లిఖార్జునరావు, మంగళంపల్లి వెంకట సుబహ్మణ్యకుమార్, వారణాసి శాంతేశ్వరరావు, దూళ్ల శ్రీనివాస్, ఆర్.నాగేశ్వరరావు, జయశంకర్‌లను సీఐడీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించింది. వీరికి సంబంధించిన రూ.450 కోట్ల విలువైన 98 స్థిరాస్తులను సీజ్ చేసి కోర్టుకు అటాచ్ చేసింది. ఈ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాల్సి ఉన్నా ఇదేదీ జరగడం లేదు. కేసు రాజమహేంద్రవరంలోని పీడీజే న్యాయస్థానంలో కొనసాగుతుండగా పదేపదే కేసులో సీఐడీ వాయిదాలు కోరుతోంది. దీంతో వేలం ప్రక్రియ ఎప్పటికీ జరుగు తుందో అంతు పట్టడం లేదు. బాధితులకు న్యాయం చేసేందుకు సీఐడీ అటాచ్ లో ఉన్న రూ.450 కోట్ల స్థిరాస్తులను వేలం వేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ షాన్‌మోహన్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వేలం ప్రక్రియ ముందుకు సాగేలా సీఐడీని ప్రభుత్వం ఆదేశించింది. కానీ సీఐడీ చొరవ చూపడం లేదు.
డిపాజిట్‌దారులు 21,895
కుంభకోణానికి సంబంధించి 21,895 మంది డిపాజిట్‌దారులకు 2022 నాటికి వడ్డీతో కలిపి చెల్లించాల్సిన మొత్తం రూ.511 కోట్లు ఉంది. రూ.లక్షలోపు డిపాజిట్‌దారులు 13,249 మంది ఉండగా రూ.32.72 కోట్లు చెల్లించాల్సి ఉంది. రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్య డిపాజి ట్‌దారులు 2,384 మంది ఉండగా వీరికి రూ.37.83 కోట్లు, రూ.3 నుంచి రూ.4 లక్షల లోపు 810మంది ఉండగా వీరికి రూ.27.99 కోట్లు, రూ.5లక్షలలోపు 677 మంది బాధితులు ఉండగా వీరికి రూ.30.41 కోట్లు, రూ.5 లక్షలు ఆపైన బాధితులు 2,563 మంది ఉండగా వీరికి రూ.349 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది.
కేసులపై కేసులు దాఖలు..
నిందితులు, రుణగ్రహీతల ఆస్తులు వేలం వేసి తమకు ఆ డబ్బు ఇవ్వాలంటూ విజయవాడ లోని డిస్ట్రిక్ట్ కోపరేటివ్ ట్రిబ్యునల్‌లో బాధితు ల తరపున సొసైటీ సభ్యులు ఇప్పటివరకు 13 కేసులు దాఖలు చేశారు. తాజాగా మరో 30 కేసులు దాఖలు చేశారు. ఈ కేసులకు సం బంధించి ఆస్తుల విలువ రూ.70 కోట్లు ఉంది. వీటిపై తుది తీర్పు వస్తే కొంత వరకు నగ దు తిరిగొచ్చే అవకాశం ఉంది. ఈ డబ్బొస్తే చిన్న బాధితులకు న్యాయం జరుగుతుందని భావి స్తున్నా ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి.