సందేశాన్ని ఇస్తూ.. చరిత్రను తెలియజేస్తూ..
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:17 AM
పిఠాపురం/పిఠాపురం రూరల్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యం కంటే సాంస్కృతి కాలుష్యం ప్రమాదకరమైందని, దీనిని మనస్సు దరి చేరనివ్వద్దు అం టూ సందేశాన్ని ఇస్తూ, అదే సమయంలో రంపవిప్లవ వీరుడు చరిత్రను తెలియజేస్తూ నాటికలు సందేశాత్మకంగా సాగాయి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురంలో భోగాపురం నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీల తొలిరోజున ప్రదర్శిం

భోగాపురంలో జాతీయస్థాయి నాటిక పోటీల్లో ఆలోచింపజేసిన ప్రదర్శనలు
పిఠాపురం/పిఠాపురం రూరల్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యం కంటే సాంస్కృతి కాలుష్యం ప్రమాదకరమైందని, దీనిని మనస్సు దరి చేరనివ్వద్దు అం టూ సందేశాన్ని ఇస్తూ, అదే సమయంలో రంపవిప్లవ వీరుడు చరిత్రను తెలియజేస్తూ నాటికలు సందేశాత్మకంగా సాగాయి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురంలో భోగాపురం నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీల తొలిరోజున ప్రదర్శించిన నాటికలు అందరిని ఆలోచింపచేశా యి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండ లం టి.కృష్ణ ఆర్ట్ థియేటర్స్ కళాకారులు ప్రదర్శించిన ప్రేమించే వయసేనా నాటిక ద్వారా టీనేజీలో ప్రేమలో పడటం ద్వారా విలువైన జీవితాన్ని కోల్పోవద్దు అంటూ సూచించారు. 18 ఏళ్లు నిండితే కాని మనకు విచక్షణ రాదు. ఓటు హక్కు ఇవ్వడం లేదు. అటువంటప్పుడు జీవితాంతం తోడుగా ఉండే భాగస్వామిని ఎలా ఎ న్నుకోగలం అంటూ నాటిక ద్వారా ప్రశ్నించారు. ఒక మాస్టారి కూతురు తల్లిదండ్రుల మాట వినకుండా ప్రేమలో పడుతోంది. ఇంట్లో పెళ్లి నిశ్చయించినా కాదని ప్రియుడి దగ్గరకు వెళ్లిపోతుంది. తల్లికి పక్షవాతం రాగా.. కొన్నాళ్లకు కూ తురు మోసపోయి తిరిగి వారి వద్దకు వస్తుంది. తల్లిదండ్రులు కూతురు పట్ల చూపిన ప్రేమ, దానిని కాదని ప్రేమ అనే ఆకర్షణలో పడి వెళ్లిపోవడం అంశాలను నాటికలో చూపించారు. జరుగుల రామారావు, దండా అనంతబాబులు రచించగా, రామారావు దర్శకత్వం వహించారు.
చరిత్ర విస్మరించినా..
తొలి స్వాతంత్య్రయోధుడు, దేశం కోసం దేహత్యాగం చేసిన రంప విప్లవవీరుడు చంద్రయ్యనాయుడిని చరిత్ర విస్మరించిందని, గుడివాడ కృష్ణ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఆసోసియేషన్ కళాకారులు ద్వారబంధాల చంద్రయ్యనాయుడు నాటిక ద్వారా అతని చరిత్రను చాటిచెప్పారు. అల్లూ రి సీతారామరాజు కంటే 4 దశాబ్దాలకు ముందే మన్యసీమలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్య మించడమే గాక, జమీందార్లను కొల్లగొట్టి పేదలకు పంచారని, ఒరిస్సా నుంచి గోదావరి మం డలం వరకూ తన పోరాటాలు సాగించారని వి వరించారు. నాటికను పీవీ సత్యనారాయణ రచి ంచగా, పి.కృష్ణహితేష్ దర్శకత్వం వహించారు.