Share News

టెన్సన్‌లోను...!

ABN , Publish Date - Jul 09 , 2025 | 01:49 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీ, ఎస్సీ కార్పొరే షన్ల ద్వారా ఇచ్చే స్వయం ఉపాధి రుణ యూనిట్లకు లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ తరహా రుణాలను ఐదేళ్లు పూర్తిగా నిలిపి వేసింది. అయితే కూటమి ప్రభుత్వం రావడంతో కార్పొరేషన్‌ రుణాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో అంతా సంబరపడ్డారు. తీరా రుణాలు మంజూరైనట్టే అయి నిలిచిపోవడంతో అసలు వీటిని ఎప్పుడు తిరిగిస్తారో తెలియక పడిగాపులు కాస్తున్నారు .

టెన్సన్‌లోను...!

కార్పొరేషన్‌ రుణాలకు ఎదురుచూపులు

రెండు నెలల కిందట నిలిపివేత

5,137 యూనిట్లు మంజూరు

45,765 దరఖాస్తులు రాక

ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి

సీఎం దృష్టికి సమస్య

పెంపు యోచనలో నిలిపివేత

రెండు నెలలైనా తేలని నిర్ణయం

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీ, ఎస్సీ కార్పొరే షన్ల ద్వారా ఇచ్చే స్వయం ఉపాధి రుణ యూనిట్లకు లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ తరహా రుణాలను ఐదేళ్లు పూర్తిగా నిలిపి వేసింది. అయితే కూటమి ప్రభుత్వం రావడంతో కార్పొరేషన్‌ రుణాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో అంతా సంబరపడ్డారు. తీరా రుణాలు మంజూరైనట్టే అయి నిలిచిపోవడంతో అసలు వీటిని ఎప్పుడు తిరిగిస్తారో తెలియక పడిగాపులు కాస్తున్నారు .ఉమ్మడి జిల్లావ్యాప్తం గా రుణాలకు వేలల్లో పోటీ నెలకొనగా.. యూనిట్లు వందల్లోనే ఉండడంతో ఎక్కడి కక్క డ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో యూనిట్ల సంఖ్య మరింత పెంచాలని ప్రభుత్వాన్ని కోరడంతో తదుపరి నిర్ణయం కోసం రుణాలు మంజూరు చేయకుండా నిలిపివేశారు. ఇప్పటికే రెండు నెల లు దాటడంతో అసలెప్పుడు వీటిని ప్రభుత్వం మంజూరు చేస్తుందోనని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 5,137 యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేయగా.. అదే స్థాయిలో మళ్లీ కోటా పెంచవచ్చని భావిస్తున్నారు.

మంజూరు చేసిన యూనిట్లు ఇవే..

రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కిందట బీసీ, కాపు, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్‌ కార్పొరేషన్ల కింద భారీగా స్వయం ఉపాధి యూనిట్లను ఉమ్మడి జిల్లాకు మంజూరు చేసింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను బీసీ, ఎస్సీ కార్పొరేషన్లకు అప్పగిం చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు 2,405 రుణ యూనిట్లను మంజూరు చేశారు. వీటి కింద ఫ్లవర్‌బొకేలు, వర్మీకంపోస్ట్‌ యూనిట్‌, వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌, ఎల్‌ఈడీ బల్బుల అసెంబ్లీ యూనిట్‌, ప్లంబింగ్‌, వాటర్‌ బాటిల్‌ రీసైక్లింగ్‌, వాటర్‌ రీసైక్లింగ్‌ యూనిట్లు, ఫిష్‌ ఫార్మింగ్‌, అడ్వంచర్‌ టూరిజం, సబ్బులతయారీ, మొబైల్‌ కార్‌ వాష్‌, బేకరీ, ఫ్లైయాష్‌ బ్రిక్‌ యూనిట్‌, సెరికల్చర్‌, వెల్డింగ్‌, బ్యూటీ పార్లర్‌, మెడికల్‌ ల్యాబ్‌, మూడు చక్రాల ప్యాసింజర్‌ ఈ-ఆటో, నాలుగు చక్రాల ఆటో,కారు, గూడ్స్‌ ట్రక్‌వంటి వ్యాపారాలు చేసుకునేలా యూనిట్లు నిర్ణయిం చారు. ఆయా వ్యాపారాన్ని బట్టి ప్రభు త్వం 40 నుంచి 60 శాతం సబ్సిడీ, మిగిలింది బ్యాంకు రుణం, ఐదు శాతం వరకు లబ్ధిదారుడి వాటా కింద విభజించారు. ఈ మేరకు సామా జికవర్గాలవారీ దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది.

యూనిట్లు పెంచే యోచన..

ఐదేళ్ల తర్వాత మళ్లీ ఈ పథకం అమల్లోకి రా వడంతో దరఖాస్తుదారులు వేలల్లో పోటె త్తారు. ఎంపికకాని వేలాదిమంది పేద యువత, నిరు ద్యోగులు ఎమ్మెల్యేల వద్దకు క్యూకట్టారు. అటు ఎమ్మెల్యేల అనుచరులు సైతం అర్హత ఉన్న తమవారికి కూడా యూనిట్లు రాలేదని విన్న వించారు. దీంతో నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. యూనిట్లు పెంచాల్సిన అవసరా న్ని వివరించారు. ఆ తర్వాత జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ల్లోను జిల్లాల అధికారులు విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. ప్రస్తుతం కేటాయించిన యూనిట్లు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందనే చర్చ ప్రభుత్వంలో జరిగింది. దీంతో ఇది వరకే ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను నిలిపివేయాలని అధికారులు నిర్ణ యించారు. పెంచబోయే యూనిట్లను కలిపి అందరికే ఒకేసారి పథకం వర్తిం పజేయాలని సమాచారం పంపించారు. అదనపు యూనిట్లు మంజూరు చేస్తామని రెండునెలలు దాటుతు న్నా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీం తో అప్పటికే ఎంపికైన లబ్ధిదారులు, కొత్త యూ నిట్లు వస్తాయని ఆశతో ఉన్న వారు నిరీ క్షిస్తూ కూర్చున్నారు. అసలు వీటిని ఎప్పుడు విడుదల చేస్తారంటూ జిల్లాల్లో ఆయా శాఖల అధికారు లను అదే పనిగా సంపద్రిస్తున్నారు. అయితే యూనిట్ల పెంపు ఖాయమని, అది ఎప్పుడనేది తమకు కూడా సమాచారం లేదని జవాబు ఇస్తున్నారు.ప్రభుత్వం మాత్రం నియోజకవర్గాల వారీగా ఆయా సామాజికవర్గ అవసరాలను బట్టి త్వరలో కోటా నిర్ధారించి యూనిట్ల సంఖ్య ను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచా రం. ఎమ్మెల్యేల తరపున కోటా కాకుండా ఎక్కు వమంది సామాన్య యువతకు యూనిట్లు అం దేలా సంఖ్యను నిర్ధారించి త్వరలో ప్రకటించ నున్నట్టు అధికారులు చెబుతున్నారు.

గత ఐదేళ్లూ.. రుణ ఊసేలేదు..

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఈ రెండు కార్పొరేషన్లను అటకెక్కించేసింది.నిరుద్యోగులకు రుణ సదుపాయం కల్పించకుండా వారిని ఇబ్బ ంది పెట్టింది.2019నాటికి మునుపటి టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులకు పంచడానికి సిద్ధం గా ఉన్న రుణాలు, పనిముట్లను సైతం మూ లనపారేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఐదేళ్ల పాటు ఈ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూ రు చేయకుండా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టిం ది. ప్రభుత్వం మారాక సీఎం చంద్రబాబు ఆదే శాలతో మళ్లీ బీసీ,కాపు, ఎస్సీ,ఈడబ్ల్యూఎస్‌ వర్గా లకు స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేయాలని అధికారులు నిర్ణయించారు.

వేలల్లో దరఖాస్తులు

యూనిట్లు వందల్లో ఉంటే దరఖా స్తుదా రులు వేలల్లో వచ్చారు. ప్రధానంగా బీసీ కార్పొరేషన్‌ రుణాల కింద కాకినాడ జిల్లాకు రూ.39.52 కోట్ల విలువైన 1,914 యూనిట్లు మంజూరు చేస్తే ఏకంగా 31,859 మంది, తూర్పుగోదావరి జిల్లాలో రూ.28.87 కోట్ల విలువైన 1,374 యూనిట్లకు 16,408 మంది, కోనసీమ జిల్లాలో రూ.29.54 కోట్ల విలువైన 1,394 యూనిట్లకు 15,147 మంది పోటీ పడ్డారు. కాపు కార్పొరేషన్‌ కింద కాకినాడలో రూ.28.24 కోట్ల విలువైన 763 యూనిట్లకు 21,454 దరఖాస్తులు, తూర్పుగోదావరి జిల్లా లో రూ.27.15 కోట్ల విలువైన 757 యూని ట్లకు 8,193 మంది, కోన సీమ జిల్లాలో రూ.27.14 కోట్ల విలువైన 757 యూనిట్లకు 15,644 మంది పోటీపడ్డారు. ఈడ బ్ల్యూఎస్‌ కార్పొరేషన్‌ కింద ఉమ్మడి జిల్లాకు రూ.14 కోట్ల విలువైన 511 యూనిట్లు మం జూరు చేయగా 6 వేల మంది దరఖాస్తులు చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ కింద కాకినాడ జిల్లాకు 798 యూనిట్లు మంజూ రవగా 5,497, కోన సీమ జిల్లాకు 1,043 యూనిట్లకు 3,265 మం ది,తూర్పుగోదావరి జిల్లాలో 891 యూనిట్లకు 4,555 మంది దరఖాస్తులు చేశారు.

Updated Date - Jul 09 , 2025 | 01:49 AM