సముద్రపు కోతకు త్వరలో శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:39 AM
పిఠాపురం, జూలై 18 (ఆంధ్ర జ్యోతి): దీర్ఘకాలం గా ఉన్న సముద్ర కోత సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనున్నదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో ఈ కోత నివారణకు కోస్టల్ ప్రొటెక్షన్ స్ట్రక్చర్స్ నిర్మాణానికి రూ.323 కో

రూ.323 కోట్లతో ప్రతిపాదనలు
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
పిఠాపురం, జూలై 18 (ఆంధ్ర జ్యోతి): దీర్ఘకాలం గా ఉన్న సముద్ర కోత సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనున్నదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో ఈ కోత నివారణకు కోస్టల్ ప్రొటెక్షన్ స్ట్రక్చర్స్ నిర్మాణానికి రూ.323 కోట్ల తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయు డు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నేషన ల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన లు పంపినట్టు ఆయన శుక్రవారం సామా జిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గత ఐదేళ్లలోనే సగటున ఏడాదికి 1.23 మీటర్ల వంతున ఇప్పటిదాకా 12 మీటర్ల మేర తీర ప్రాంతం కోతకు గురైందని తెలిపారు. దీంతో తీర ప్రాంత గ్రామాలు, నివాసముంటున్న మత్స్యకారులకు, వారి గృహాలకు భారీ నష్టం జరుగుతోందని వివరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎన్నికల సమయంలో కూటమి తరపున హామీ ఇచ్చిన విషయాన్ని అప్పటి ఎన్నికల ప్రచార వీడియోను పోస్ట్ చేసి గుర్తుచేశారు. తీర ప్రాంత ప్రజల ఆశలను ప్రదాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా గుర్తించి ప్రతిపాదనలు ఆమోదిస్తారని పవన్ తెలిపారు. ఆమోదం లభించగానే తక్షణం పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.