Subrahmanyam Murder Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. పునర్విచారణకు పిటిషన్
ABN , Publish Date - Apr 23 , 2025 | 03:15 PM
Subrahmanyam Murder Case: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ హత్యపై తదుపరి విచారణ కోరుతూ రాజమండ్రి అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

కాకినాడ, ఏప్రిల్ 23: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య (Driver Subrahmanyam Case) కేసులో తదుపరి విచారణ కోరుతూ ప్రాసిక్యూషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజమండ్రి అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈ హత్య చేసిన క్రమంలో మరికొందరి సాయం తీసుకున్నాడని వారి వివరాలు తేల్చాల్సి ఉందని ప్రాసిక్యూషన్ పేర్కొన్నారు. హత్యకు ముందు కాల్ డేటా.. టవర్ లొకేషన్ ఏవీ గతంలో పోలీసులు విచారించ లేదని మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది. ఎమెల్సీ అనంతబాబు తన కొడుకును హత్య చేసినప్పుడు గన్‌మెన్లు ఏరన్న విషయాన్ని దర్యాప్తులో విస్మరించారని అభ్యంతరం తెలిపింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో కేసును తదుపరి విచారణ చేసేలా అనుమతి కోరుతూ ప్రాసిక్యూషన్ కోర్టులో పిటిషన్ వేశారు.
కాగా..2022 మే 19న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి.. ఆపై మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ హత్యను తానే చేశానని స్వయంగా ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించడంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే మధ్యంతర బెయిల్‌పై విడుదలైన అనంతబాబు రెండేళ్లు బయట తిరుగుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ కేసును పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసులో కదలిక వచ్చింది.
Pahalgam Terror Attack: మళ్లీ సర్జికల్ స్ట్రైక్ తప్పదా..
ఇప్పుడు తాజాగా డ్రైవర్ హత్య కేసు పునర్విచారణకు కాకికాడ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందు కోసం విచారణాధికారిగా ఐపీఎస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 60 రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన నివేదికను డీజీపీ, ఎస్పీకి ఇవ్వాలని దేవరాజ్‌ను ఆదేశించారు. అలాగే ఈ కేసులో తమకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని బాధిత కుటుంబం కోరింది. వారికి పరిహారం అందజేయడంతో పాటు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా హామీ ఇచ్చారు. అంతేకాకుండా న్యాయ సలహాల కోసం ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును కూడా నియమించారు.
ఇవి కూడా చదవండి
PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు
Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ
Read Latest AP News And Telugu News