Share News

ఉద్యమంలా మొక్కలు నాటుదాం: డోలా

ABN , Publish Date - Jun 06 , 2025 | 04:25 AM

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. దీనికోసం అందరూ ఉద్యమంలా మొక్కలు నాటాలి’ అని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు.

ఉద్యమంలా మొక్కలు నాటుదాం: డోలా

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ‘పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. దీనికోసం అందరూ ఉద్యమంలా మొక్కలు నాటాలి’ అని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తదితరులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం డోలా మాట్లాడుతూ... ‘ఏపీని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా, గ్రీన్‌ ఆంధ్రగా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కృషి చేస్తున్నారు. మనం కూడా ప్రకృతి పరిరక్షణకు మొక్కలు నాటి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు.

Updated Date - Jun 06 , 2025 | 04:27 AM