Andhra Pradesh: ఇచ్చిన మాట నిలబెట్టకున్న పవన్ కల్యాణ్..
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:53 PM
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఎన్నికల వేళ ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.

అమరావతి, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఎన్నికల వేళ ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ ఘట్టంతో ఎన్నికల హామీని నిలుపుకున్నట్లయ్యింది. శుక్రవారం నాడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు.
పిఠాపురంలో ఇప్పటికే 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. అయితే, ఎన్నికల వేళ దీనిని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తానంటూ పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రూ.34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ఆసుపత్రిలో రెండు కొత్త బ్లాకులు, ఓపీ వార్డు, మార్చురీ వార్డు, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి నిర్మాణం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలతోపాటు ఆరు పరిసర మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలోనే నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇటీవలే అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పులు పంపిణీ చేశారు. ఆ గ్రామంలో ‘అడవితల్లి బాట’ కార్యక్రమం చేపట్టిన సందర్భంలో.. తనతో నడిచిన గ్రామస్తులకు చెప్పులు లేకపోవడాన్ని పవన్ గుర్తించారు. ఆ పర్యటన ముగించుకుని వెళ్లాక.. పవన్ ఆ గ్రామస్తుల కోసం చెప్పులు పంపించారు. గ్రామస్తులందరికీ చెప్పులు పంపిణీ చేశారు. దీంతో ఆ గ్రామస్తులు చాలా సంబరపడిపోయారు. ఉపముఖ్యమంత్రి పవన్ తమకు చెప్పులు పంపడంతో సంతోషం వ్యక్తం చేశారు.
Also Read:
ఢిల్లీ కొత్త మేయర్‌గా బీజేపీ నేత రాజా ఇక్బాల్ సింగ్
పహల్గాం దాడి వెనుక హమాస్ హస్తం ఉందా..
For More Andhra Pradesh News and Telugu News..