అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఐ
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:21 AM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కూటమి ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఆయన ప్రభుత్వంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోపించిందని, చంద్రబాబు కూడా జగన్ బాటలోనే పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక, ప్రధాని మోదీకి ప్రజల ప్రాణాలకన్నా ఎన్నికలే ముఖ్యమయ్యాయని మండిపడ్డారు. కశ్మీర్‌లోని పహల్గాంలో 28 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడం ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయమన్నారు.