Share News

AP Liquor Scam: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆగష్టు 1 వరకు రిమాండ్

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:59 PM

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతడ్ని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

AP Liquor Scam: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆగష్టు 1 వరకు రిమాండ్
AP Liquor Scam

అమరావతి, జులై 20: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. లిక్కర్‌ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఏ-4గా ఉన్న విషయం తెలిసిందే. దీనిపై నేడు(ఆదివారం) విచారణ జరిపిన కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. దీంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పోలీసులు తరలించారు. శనివారం నాడు ఎంపీని ఏడు గంటలపాటు విచారించిన సిట్ అధికారులు అనంతరం నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. ఇవాళ(ఆదివారం) వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లిక్కర్ వ్యవహారాలలో జరిగిన అవకతవకల్ని సిట్ తన రిమాండ్ రిపోర్ట్ లో పొందుపర్చింది. దీన్ని శనివారం నాడు కోర్టుకు సమర్పించారు సిట్ అధికారులు. ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంశాలు చూస్తుంటే, ప్రజానీకం ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. ఇంతకీ ఈ రిపోర్ట్ లో ఏయే విషయాలు ఉన్నాయో చూద్దాం..


  • 2019 నుంచి 2024 వరకు ఏపీలో మద్యం ధరలను అనూహ్యంగా పెంచి తద్వారా డిస్టలరీల నుంచి ముడుపులను కిక్ బ్యాగ్స్ రూపంలో సేకరించినట్టు వెల్లడించిన రిమాండ్ రిపోర్ట్

  • ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అనుచిత లబ్ధి పొందేందుకు ఈ కుంభకోణంలో కిక్ బ్యాగ్స్ తీసుకున్నట్లు వెల్లడించిన సిట్

  • అధికార దుర్వినియోగం చేసి మద్యం విధానాన్ని మార్చి నిధుల దుర్వినియోగానికి పాల్పడి రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగించారని పేర్కొన్న రిమాండ్ రిపోర్ట్

  • లిక్కర్ వ్యవహారంలో ఫోర్జరీ, చీటింగ్ చేసి న్యాయవిరుద్దంగా వ్యవహరించారని ఆరోపణ

  • నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం, అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగులను లొంగ తీసుకున్నారని పేర్కొన్న రిమాండ్ రిపోర్ట్

  • బహుళజాతి కంపెనీల బ్రాండ్లను పక్కకు తప్పించి, స్వంత లోకల్ బ్రాండ్లను తయారు చేయించి కొనుగోలు చేశారని పేర్కొన్న సిట్

  • డిస్టలరీల నుంచి మద్యం తీసుకునేందుకు ఆర్డర్ ఆప్‌ సప్లై కూడా మ్యానువల్‌గా చేశారని.. ఇందులో కూడా మోసం ఉందని వివరించిన సిట్

  • గతంలో ఉన్న విధానాన్ని మార్చి ఆర్డర్ ఆఫ్ సప్లైను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారని.. అప్పుడున్న బేవరేజస్ కార్పొరేషన్ ఎండి కూడా దీన్ని ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపి ఆమోదించారని వివరించిన అధికారులు

  • మద్యం కుంభకోణంలో ముడుపులు అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చేరడానికి ముందు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డికి వచ్చాయని పేర్కొన్న సిట్

  • డిస్టలరీల నుంచి మద్యం బేసిక్ ధరలపై 12 నుంచి 20 శాతం వరకు కిక్ బ్యాగ్స్ రూపంలో తీసుకున్నారని సిట్ నివేదిక

  • ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ లో బ్రాండ్ సెలక్షన్‌ తోపాటు అప్పుడున్న బేవరేజస్ కార్పొరేషన్ అధికారులు మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు మెక్ డోవెల్స్, కింగ్ ఫిషర్, బడ్‌వైజర్ వంటి బ్రాండ్లను కావాలని తొక్కిపెట్టారని పేర్కొన్న సిట్

  • మిథున్ రెడ్డి 2023 మేలో పలుమార్లు సీఎం ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డితో మాట్లాడారని కూడా పేర్కొన్న సిట్ నివేదిక

  • అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ బార్గవ్‌తోనూ మాట్లాడడం, విధానాల మార్పు, ధరల పెంపు వంటి అంశాలను కూడా ఆయనతో చర్చించారని వివరించిన సిట్

  • అమెరికా, అరబ్ ఏమిరేట్స్ లో పలు షెల్ కంపెనీలను గుర్తించి అందులోకి పెట్టుబడులు పంపారని అయితే, ఈ దేశాలకు నిధులు బదిలీ చేసేందుకు అధికారికంగా బ్యాంక్ ఛానల్స్ లేవని పేర్కొన్న రిమాండ్ రిపోర్ట్

  • బేవరేజస్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్దంగా అధికారులు వ్యవహరించడం ద్వారా లోతైన కుట్రకు తెరలేపారని పేర్కొన్న సిట్

  • లిక్కర్ కంపెనీలకు అనుచిత లబ్ది కల్పించి వారి నుంచి అధికారులు, రాజకీయ నేతల ప్రమేయంతో కిక్ బ్యాగ్స్ సేకరించారని వివరించిన సిట్

  • మద్య నిషేధం చేస్తామనే సాకుతో మద్యం వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించి మొత్తం వ్యవస్థను కేంద్రీకృతం చేసిందన్న సిట్

  • 2019 అక్టోబర్ 8వ తేదీన తిరుపతిలోని మిథున్ రెడ్డి నివాసంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్ సమావేశం అయ్యారని.. ఆయనకు ఐఏఎస్‌గా పదోన్నతి కల్పిస్తానని ఎంపీ పేర్కొన్నారని రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడి


  • ఆ తర్వాత మిథున్ రెడ్డి.. సత్యప్రసాద్‌ను హైదరాబాద్ లోని విజయ్ సాయిరెడ్డి నివాసానికి పిలిపించి గతంలో ఉన్న మద్యం విక్రయాల నివేదికను తీసుకోవాలని.. వాసుదేవరెడ్డిని కలవాలని కోరారు.

  • 2019 అక్టోబర్ 13వ తేదీన మిథున్ రెడ్డి, ముప్పిడి అవినాష్‌ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సత్యప్రసాద్, విజయ్ సాయిరెడ్డి హైదరాబాద్ లో కలుసుకున్నారని వివరించిన రిమాండ్ రిపోర్ట్

  • అంతకు ముందు మూడు సంవత్సరాల మద్యం విక్రయాలను పరిగణనలోకి తీసుకుని విధానాన్ని మారిస్తే నెలకు రూ.50 నుంచి రూ.60 కోట్ల కమీషన్లు కిక్ బ్యాగ్స్ రూపంలో వస్తాయని అంచనా వేసుకున్న మిథున్ రెడ్డి బృందం

  • వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఇరువురు కలిపి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించాలని సూచించిన మిథున్ రెడ్డి

  • కిక్ బ్యాగ్స్ ఇస్తామన్న సరఫరాదారులకు చెందిన డిస్టలరీలకు మాత్రమే ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించిన సిండికేట్

  • డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ ప్రతిరోజూ వాట్సాప్ కాల్స్ చేసి మిథున్ రెడ్డి సూచనల మేరకు డిపో మేనేజర్లకు తమకు కిక్ బ్యాగ్స్ ఇచ్చే కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించే వారని వివరించిన రిమాండ్ రిపోర్ట్

  • మద్యం కేసుకు 150 నుంచి 600 రూపాయిల వరకు కిక్ బ్యాగ్స్ రేట్లుగా నిర్ణయించారని పేర్కొన్న రిపోర్ట్

  • అనూష అనే డేటా ఎంట్రీ ఆపరేటర్ ను విజయ్ సాయిరెడ్డి సిఫార్స్ మేరకు బేవరేజస్ కార్పొరేషన్ లో నియమించారని రిమాండ్ రిపోర్ట్ లో వివరించిన సిట్

  • అనూష ద్వారా డేటా తెప్పించుకుని మద్యం డిస్టలరీల నుంచి ముడుపులు నగదు రూపంలో తీసుకుని మిథున్ రెడ్డి పర్యవేక్షించే వారని సిట్ వెల్లడి

  • పాపులర్ బ్రాండ్లను తొలగించి నాశిరకం మద్యం విక్రయించేందుకు ఈ సిండికేట్ లోకల్ బ్రాండ్లను ప్రోత్సహించిందని.. తమ రాజకీయ పలుకుబడి వినియోగించారని వివరించిన రిపోర్ట్

  • బంగారం వ్యాపారులకు ముడుపులను పంపి బంగారం కొనుగోలు చేసినట్లు.. జీఎస్టీ ఇన్ వాయస్ లు తీసుకొని, ఆ తరువాత డబ్బును కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేదా చాణక్య కమీషన్లు మినహాయించుకొని బంగారం షాపులవారు ఇచ్చారని రిమాండ్ రిపోర్ట్ వెల్లడి

  • 300 నుంచి 400 కోట్ల రూపాయిల మేర డిస్టలరీల నుంచి నగదు.. బంగారం వ్యాపారులకు వెళ్లి, అక్కడ నుంచి నిందితుడి వద్దకు చేరిందని కూడా వివరించిన రిమాండ్ రిపోర్ట్

  • షెల్ కంపెనీల అకౌంట్లకి డబ్బు పంపడం, ప్రమోషన్ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొనడం, గార్మెంట్స్, గోల్డ్ కాయిన్స్ వంటివి కొనుగోలు చేసినట్లు చూపించారని వెల్లడి

  • లిక్కర్ సిండికేట్ లో ఉన్న సభ్యులకు, వాళ్ల స్నేహితుల రియల్ ఎస్టేట్, ఇతర కంపెనీలకు కూడా నిధులను మళ్లించినట్లు వివరించిన రిమాండ్ రిపోర్ట్

  • దర్యాప్తు సంస్థల దృష్టి మళ్లించేందుకు ముడుపులను ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్ లో ఉండే షెల్ కంపెనీలకు హవాల ద్వారా పంపారని వివరించిన రిమాండ్ రిపోర్ట్


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 20 , 2025 | 06:01 PM