Share News

Housing Scam: ఇళ్లు కట్టిస్తానని మోసం చేసిన కాంట్రాక్టర్‌ అరెస్టు

ABN , Publish Date - Jul 15 , 2025 | 03:28 AM

ఇళ్ల్లు కట్టిస్తానని అగ్రిమెంట్‌ చేసుకుని నిర్మాణాలు పూర్తి చేయకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసిన..

Housing Scam: ఇళ్లు కట్టిస్తానని మోసం చేసిన కాంట్రాక్టర్‌ అరెస్టు

తెనాలిరూరల్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఇళ్ల్లు కట్టిస్తానని అగ్రిమెంట్‌ చేసుకుని నిర్మాణాలు పూర్తి చేయకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసిన కాంట్రాక్టర్‌ను అరెస్ట్‌ చేసినట్టు గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం... పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా గత ప్రభుత్వంలో మండలంలోని నేలపాడు లేఅవుట్‌లో లబ్ధిదారులకు స్థలాలు ఇచ్చారు. అక్కడ ఇంటి నిర్మాణాలకు ఒప్పందం చేసుకున్న పట్టణంలోని మారీసుపేటకు చెందిన ఎస్‌జి బిల్డింగ్‌వర్క్‌ పున్నారావు కాలపరిమితి ముగిసినా నిర్మాణాలు పూర్తి చేయలేదు. పలువురి నుంచి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1,80,000 నగదు చొప్పున తీసుకుని నిర్మాణపనులు సగంలోనే వదిలేసి ఇబ్బందులకు గురిచేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 03:28 AM