Share News

K.Narayana: కమ్యూనిస్టు ఉద్యమ పంథా మారాలి

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:35 AM

కమ్యూనిస్టు ఉద్యమ పంథాను మార్చాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

K.Narayana: కమ్యూనిస్టు ఉద్యమ పంథా మారాలి

  • ఎన్‌డీఏకి ఇండియా కూటమే ప్రత్యామ్నాయం: నారాయణ

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): కమ్యూనిస్టు ఉద్యమ పంథాను మార్చాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నక్సలైట్ల సాకుతో అమాయక గిరిజనులను బలి తీసుకుంటున్నారని విమర్శించారు. దేశంలో ఎన్‌డీఏకు ఇండియా కూటమే ప్రత్యామ్నాయమని చెప్పా రు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఇండియా కూటమి పార్టీలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏపీలోనూ ఇండియా కూటమిని బలోపేతం చేసేందుకు ప్రజాసమస్యలపై సమష్ఠిగా పోరాడాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌ 6 హామీలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సన్నద్ధం కావాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Updated Date - Jun 26 , 2025 | 06:35 AM