Share News

Minister Nara Lokesh : విశాఖలో భాగస్వామ్య సదస్సుకు కమిటీలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:47 AM

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకునే క్రమంలో.. రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా కూటమి సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే

Minister Nara Lokesh : విశాఖలో భాగస్వామ్య సదస్సుకు కమిటీలు

  • మంత్రి లోకేశ్‌ చైర్మన్‌గా స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు

  • సీనియర్‌ అధికారులతో మరో 9 కమిటీలు

అమరావతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యాలను చేరుకునే క్రమంలో.. రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా కూటమి సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నం వేదికగా నవంబరు 14, 15వ తేదీల్లో భాగస్వామ్య సదస్సు-2025ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సదస్సుకోసం వివిధ కమిటీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆరుగురు మంత్రులతో ఏర్పాటుచేసిన స్టీరింగ్‌ కమిటీకి మంత్రి లోకేశ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ స్టీరింగ్‌ కమిటీలో మంత్రులు టీజీ భరత్‌, గొట్టిపాటి రవికుమార్‌, కందుల దుర్గేశ్‌, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్‌ సభ్యులుగా ఉంటారు. సదస్సు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సీనియర్‌ అధికారులతో మరో 9 కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వర్కింగ్‌ కమిటీ, జీఏడీలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ (పొలిటికల్‌) అధ్యక్షతన ప్రొటోకాల్‌, రిసెప్షన్‌, వసతి, ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ కమిటీ, లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ అధ్యక్షతన సెక్యూరిటీ అండ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ, పురపాలకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అధ్యక్షతన సిటీ బ్యూటిఫికేషన్‌ కమిటీ, టూరిజం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన కల్చరల్‌ కమిటీ, సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్‌ అధ్యక్షతన మీడియా అండ్‌ పబ్లిసిటీ కమిటీ, గనులు, భూగర్భ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఎగ్జిబిషన్‌ కమిటీ, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ అధ్యక్షతన ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ కమిటీ, మరో సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ అధ్యక్షతన బిజినెస్‌ అలయెన్స్‌/డెవల్‌పమెంట్‌ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, పలువురు సీనియర్‌ అధికారులను సభ్యులుగా నియమించారు.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 04:47 AM