AP CM Chandrababu Naidu: ఢిల్లీ వెళ్లి నిర్మలమ్మను కలవండి
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:17 AM
పోలవరం-బనకచర్ల పథకానికి నిధులు మంజూరించాలని కోరుతూ, సీఎం పీయూ్‌షకుమార్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవాలని ఆదేశించారు. పర్యావరణ, సాంకేతిక అనుమతులపై సమీక్షించి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు

పోలవరం-బనకచర్ల నిధులపై వినతిపత్రం ఇవ్వండి: సీఎం
పోలవరం-బనకచర్ల పథకానికి నిధులివ్వాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రం సమర్పించాలని సీఎం రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూ్‌షకుమార్‌ను ఆదేశించారు. ఆమెను ఇప్పటికే సంప్రదించానని.. శుక్రవారం (18న) ఢిల్లీ వెళ్లి ఆమెతో భేటీ కావలసిందిగా పీయూష్‌కు సూచించాలని జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ జి.సాయిప్రసాద్‌ను కోరారు. తాను కూడా 22న ఢిల్లీలో ఆమెను కలుస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతులు.. ఇతర సాంకేతిక అనుమతులపై సమీక్షించి.. సమగ్ర నివేదిక సిద్ధంచేయాలన్నారు.