Amaravati Farmers: సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన అమరావతి రైతులు
ABN , Publish Date - Apr 28 , 2025 | 09:03 PM
Amaravati Farmers: అమరావతి రైతులతో ఉండవల్లి నివాసంలో సమావేశం అయ్యారు. వారితో పలు కీలక విషయాల గురించి చర్చించారు. ప్రధాని రాక నేపథ్యంలో రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. విధ్వంసం నుంచి రైతులు అమరావతిని కాపాడరంటూ ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రైతులతో సోమవారం కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాలకు చెందిన కొంతమంది రైతులను ఈ పున:ప్రారంభ పనుల్లో భాగం చేయాలని ముఖ్యమంత్రి భావించారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అమరావతి రైతులతో ఉండవల్లి నివాసంలో సమావేశం అయ్యారు. వారితో పలు కీలక విషయాల గురించి చర్చించారు. ప్రధాని రాక నేపథ్యంలో రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. విధ్వంసం నుంచి రైతులు అమరావతిని కాపాడరంటూ ప్రశంసించారు.
సీఎం చంద్రబాబు తన విజన్‌ను మాకు చూపారు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో మీటింగ్ అయిపోయిన తర్వాత అమరావతి రైతులు మీడియాతో మాట్లాడారు.. ‘ రాజధాని అమరావతి నిర్మాణం విధ్వంసం నుంచి అభివృద్ధి పథం వైపు వెళుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న కార్యక్రమానికి అమరావతి రైతులు రావాలని కోరారు. రైతులు, రైతు కూలీలను గ్రామాల వారీగా పిలిచి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. విధ్వంసం నుంచి రాజధాని అమరావతిని కాపాడారంటూ రైతులను ప్రశంసించారు. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి రాజధాని అని అన్నారు. మే 2వ తేదీన జరిగే సభకు అందరూ రావాలని ఆహ్వానించారు.
ప్రధాని లక్ష కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీని ఘనంగా ఆహ్వానిస్తాం. బంధుమిత్ర సపరివారంగా పెద్ద ఎత్తున ప్రధాని మీటింగ్‌కు వస్తాం. మాకు సమస్యలు లేవు అపోహలు మాత్రమే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన విజన్‌ను మాకు చూపారు. నిజమైన అభివృద్ధి అమరావతి విస్తరణతోనే సాధ్యం అవుతుందని మేము నమ్ముతున్నాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్