Share News

AP Pensions: ఏపీలో కొత్త పెన్షన్లకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Apr 24 , 2025 | 08:07 PM

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం కొత్త వితంతు పెన్షన్లకు సీఎం ఆమోదం తెలిపారు.

AP Pensions: ఏపీలో కొత్త పెన్షన్లకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
AP pensions

AP pensions: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ నెలకు రూ.4 వేలు చేసిన సంగతి తెలిసిందే. దివ్యాంగులకు సైతం నెల రూ.6 వేలు ఇస్తోంది. ఒకటో తేదీ ఉదయాన్నే ప్రభుత్వ అధికారులు ఏకంగా ఇంటికొచ్చి మరీ పెన్షన్ అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు లక్ష కొత్త పెన్షన్లకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్‌ను జూన్ నుండి అందజేస్తారు.


కాగా, 2014- 19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా జరిగేది. లబ్ధిదారులు వారంలో ఏ రోజైన సరే పెన్షను దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖరుకు పెన్షన్ జాబితాను సిద్ధం చేసేవారు. ఫలితంగా అర్హులైన లబ్ధిదారులకు ఆ మరుసటి నెల నుంచే పెన్షన్ పొందే అవకాశం ఉండేది. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానానికి చెక్ పెట్టింది. ఆరు నెలలకు ఒకసారి మాత్రమే లబ్ధిదారుల జాబితాను రూపొందించే విధానం తీసుకొచ్చింది.

ప్రతి ఏడాది జూన్‌, డిసెంబరు నెలల్లోనే జాబితా రూపొందిస్తామని తేల్చి చెప్పింది. అయితే, గడిచిన ఐదేళ్లలో ఒక్క సారి కూడా ఆ ప్రకారంగా జాబితాను రూపొందించిన దాఖలాలు లేవు. విద్యుత్‌, ఇన్‌కమ్‌ టాక్స్‌, ఫోర్ వీలర్, ఇళ్లు, పొలం తదితరాల పేరుతో వేలాదిమందిని పెన్షన్ పథకానికి అనర్హులను చేసి జగన్ ప్రభుత్వం తొలగించింది. అయితే, ఇలాంటి వారంతా కూటమి ప్రభుత్వంలో ఉపశమనం పొందుతున్నారు.


Also Read:

Waqf Bill Supreme Court hearing: వక్ఫ్ బిల్లు చట్టభద్ధతపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్

Pakistan Stock Market: అతలాకుతలమైన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్

Updated Date - Apr 24 , 2025 | 08:30 PM