Share News

Google center Vizag: దీపావళి వేళ వ్యాపారులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్

ABN , Publish Date - Oct 19 , 2025 | 05:53 PM

తాజాగా దీపావళి పండగ వేళ వ్యాపారులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. పరిశ్రమలకు మద్దతుగా, వ్యాపారాలకు ఏపీని గమ్య స్థానంగా నిలిపేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని సీఎం తెలిపారు.

Google center Vizag: దీపావళి వేళ వ్యాపారులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
CM Chandrababu Naidu

అమరావతి: కూటమి ప్రభుత్వం (Kutami Government) అధికారం చేపట్టిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలా పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా పరిశ్రమలను, వ్యాపారాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుడటంతో ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఇప్పటికే ప్రజలకు, వ్యాపారస్తులకు జీఎస్టీ తగ్గించి భారీ ఉపశమనం కలిగింది.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ భారీగా విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలను రాష్ట్రానికి తెప్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల గూగుల్ సెంటర్ విశాఖలో ఏర్పాటుకు ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధుల మధ్య ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఇలా రాష్ట్రాభివృద్ధి(AP economic development), యువతకు ఉద్యోగాల కల్పన కోసం కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.


తాజాగా దీపావళి పండగ వేళ వ్యాపారులు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. పరిశ్రమలకు మద్దతుగా, వ్యాపారాలకు ఏపీని గమ్యస్థానంగా నిలిపేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని సీఎం తెలిపారు. పరిశ్రమలకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. తొలి విడతగా రూ.1,500 కోట్ల పారిశ్రామిక రాయితీల(AP business policies) విడుదల చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఏపీ ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) వెల్లడించారు.

చంద్రబాబు సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులకు( MSME support AP) భారీ ఊరట లభించింది. పేదలకు సంక్షేమ పథకాలు, పెట్టుబడులతో ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక చెల్లింపులు, వ్యాపారస్తులకు ప్రోత్సాహకాలు అందిస్తూ అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అల్పాహారంలో పురుగులు.. హోటల్ యజమాన్యానికి షాక్ ఇచ్చిన అధికారులు

చివరి నిమిషంలో ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్

Updated Date - Oct 19 , 2025 | 09:03 PM