కుప్పం ఆస్పత్రిలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభించిన సీఎం, మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Jul 04 , 2025 | 05:14 AM
రోగుల వైద్య రికార్డులను ఆస్పత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంతి సత్యకుమార్‌తో ....

కుప్పం, జూలై 3(ఆంధ్రజ్యోతి): రోగుల వైద్య రికార్డులను ఆస్పత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంతి సత్యకుమార్‌తో కలిసి గురువారం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించారు. తద్వారా కుప్పంలోని 13 వైద్య ఆరోగ్య కేంద్రాలు అనుసంధానమయ్యాయి. రెండో దశలో చిత్తూరు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీ కేంద్రాలనూ అనుసంధానించనున్నట్లు సీఎం చెప్పారు.