Share News

Chandra Babu: దార్శనికత గల నాయకుడు

ABN , Publish Date - Apr 21 , 2025 | 01:13 AM

క్రమశిక్షణ గల విద్యార్థి.. దార్శనికత గల నాయకుడిగా ఎదిగారని చంద్రబాబు నాయుడును ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు వక్తలు పేర్కొన్నారు.

Chandra Babu: దార్శనికత గల నాయకుడు
ఎస్వీయూ సెనేట్‌ హాలులో కేక్‌ కట్‌ చేస్తున్న శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, పూర్వ విద్యార్థులు

తిరుపతి(విశ్వవిద్యాలయాలు), ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణ గల విద్యార్థి.. దార్శనికత గల నాయకుడిగా ఎదిగారని చంద్రబాబు నాయుడును ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ సెనేట్‌ హాల్లో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం భారీ కేక్‌ కట్‌ చేసి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సభాధ్యక్షత వహించిన శాప్‌ చైరన్‌ రవినాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. గ్రామీణ నేపథ్యం నుంచీ ఎదిగిన ఆయన ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావంతోనే చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి వచ్చారని చెప్పారు. చంద్రబాబు నాయుడికి స్కూల్‌, కాలేజ్‌, యూనివర్సిటీ దశల్లో స్నేహితులుగా, సన్నిహితంగా మెలిగిన అనేకమంది ఈ సభలో తమ జ్ఞాపకాలను, అనుభవాలను పంచున్నారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం తరపున పాకనాటి హరికృష్ణ, పత్తిపాటి వివేక్‌, శేషాద్రి నాయుడు, రాంబాబు నాయుడు, భువనేష్‌ చౌదరి, మురళీ మోహన్‌, డాక్టర్‌ దూపాటి ఉదయ్‌కుమార్‌, చంద్రప్రకాష్‌, అంజన్‌సింగ్‌, రంగనాథ్‌, ఆనంద్‌గౌడ్‌, రామ్మోహన్‌, ఆర్కే నాయుడు, మహే్‌షయాదవ్‌, ఉదయభాస్కర్‌, ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగ సంఘం నేత జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 01:13 AM