Share News

Tirumala High Alert: పహల్గామ్ దాడితో తిరుమలలో అలర్ట్

ABN , Publish Date - Apr 24 , 2025 | 02:44 PM

Tirumala High Alert: తిరుమలలో భద్రతా సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తిరుమలకు వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Tirumala High Alert: పహల్గామ్ దాడితో తిరుమలలో అలర్ట్
Tirumala High Alert

తిరుమల, ఏప్రిల్ 24: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడితో తిరుమలలో (Tirumala) భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్‌రోడ్డులో పలు చోట్ల భద్రతా సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజ్‌లను తనిఖీ చేస్తున్నారు. ఉగ్రముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సోదాలు ముమ్మరం చేశారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముష్కరులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరిక చేసిన నేపథ్యంలో తిరుమలకు వస్తున్న భక్తులను అందరినీ కూడా భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తోంది. అలిపిరి వద్ద నుంచే భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, భక్తులను కూడా సెర్చ్ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్నారు.


మరోవైపు తిరుమల ఘాట్‌ రోడ్డు, తిరుమలలో కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పలు చోట్ల సోదాలు చేపడుతున్నారు. భక్తుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ.. అందులో ఏదన్నా అనుమానంగా వస్తువులు కనిపిస్తే భక్తులను విచారించిన తర్వాతే వారిని విడిచిపెడుతున్న పరిస్థితి. అటు తిరుమలలో కూడా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కూడా భద్రతను పెంచడంతో పాటు అక్కడ ఆక్టోపస్ సిబ్బందితో పహారా కాసేలా ఏర్పాట్లు చేశారు. పహల్గామ్‌లో జరిగిన దాడి నేపథ్యంలో తిరుమల మొత్తం కూడా హైఅలర్ట్ జారీ చేశారు. తిరుమలకు వచ్చే భక్తులను తనిఖీ చేస్తూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.


బయటపడ్డ డొల్లతనం

ఇదిలా ఉండగా.. తిరుమలలో భద్రతలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఓ వైపు కశ్మీర్ ఉగ్రదాడులు నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ తిరుమలలో ఆకస్మికంగా తనిఖీలంటూ హడావుడి చేస్తుండగా.. మరోవైపు అన్యమత దేవుడి బొమ్మ అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకుని మరీ తిరుమలకు చేరుకుంది. కారుపై అన్యమత పేర్లు ఉన్నా కూడా భద్రతా సిబ్బంది గుర్తించని పరిస్థితి. దీంతో తిరుమలలో అన్యమత గుర్తులతో కారు యదేచ్ఛగా తిరుగుతోంది. ఈ కారును చూసి శ్రీవారి భక్తులు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

PSR Prisoner Number: జైలులో పీఎస్‌ఆర్ ప్రత్యేక అభ్యర్థన.. ఏంటంటే

Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 02:44 PM