SP Harshvardhan: ఆ ప్రాంతాల్లో సోలార్ సీసీ కెమెరాలు
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:41 PM
Solar CC Cameras: డ్రోన్ కెమెరాల సహాయంతో పలు ప్రాంతంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. గడిచిన వారం రోజుల్లో డ్రోన్ కెమెరాలతో గంజాయి స్థావరాలు, నాటు సారా తయారీ ప్రాంతాలను గుర్తించి వారిని అదుపులో తీసుకున్నామని వెల్లడించారు.

తిరుపతి, ఏప్రిల్ 28: తిరుపతి జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు (SP Harshvardhan Raju) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొట్టమొదటిసారి సోలార్‌తో పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లేవారు పోలీసుల సహాయంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేయించుకోవచ్చన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 50 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతిలో 20 , గూడూరులో 20, కోడూరు మామండురు వెళ్లే మార్గంలో బ్లాక్ జోన్ ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
డ్రోన్ కెమెరాల సహాయంతో పలు ప్రాంతంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్నామని తెలిపారు. గడిచిన వారం రోజుల్లో డ్రోన్ కెమెరాలతో గంజాయి స్థావరాలు, నాటు సారా తయారీ ప్రాంతాలను గుర్తించి వారిని అదుపులో తీసుకున్నామని ఎస్పీ హర్షవర్ధన్ వెల్లడించారు. కాగా.. ఏపీలో మొట్టమొదటి సారిగా అర్ధరాత్రి సమయంలో డ్రోన్ కెమెరాను ఉపయోగించి అల్లరిమూకల ఆటకట్టిస్తున్నారు తిరుపతి పోలీసులు. రాత్రుళ్లు విచ్చలవిడిగా గంజాయి, నాటు సారా తయారీ, గ్యాంబిలింగ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు తిరుపతి పోలీసులు ఇటీవల వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి సమయంలో మాట్రిక్ ఫోర్ ధర్మల్ డ్రోన్ కెమెరాల సాయంతో పోలీసులు అల్లమూకల ఆట కట్టిస్తున్నారు. పగటి పూట ఇలాంటి వారి పనిపట్టేందుకు పోలీసుల డ్రోన్ కెమెరాలను ఉపయోగించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
Bhojpuri singer Neha: భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్ సంచలన వ్యాఖ్యలు.. కేసు నమోదు..
దీంతో పగటి పూట కాకుండా రాత్రి సమయాల్లో గంజాయి, నాటు సారా తయారీకీ పూనుకున్నారు దుండుగుల. దీంతో వీటి ఆట కట్టించేందుకు సరికొత్త ప్రయోగానికి తెరతీశారు పోలీసులు. మాట్రిక్ ఫోర్ ధర్మల్ డ్రోన్ కెమరాల సాయంతో ఇలాంటి వారిని పట్టుకుని జైలుకు తరలిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో కూడా డ్రోన్ కెమెరాల రాకతో అల్లరిమూకల్లో భయం, వణుకు మొదలైంది. గంజాయి, నాటు సారు తాయరు చేయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసుల చర్యల పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. అధునాతన డ్రోన్ కెమెరాల సాయంతో చెట్టు తొర్రలో దాచి పెట్టిన నాటు సారాను పట్టుకున్నారు తిరుపతి పోలీసులు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు బాకరాపేట సర్కిల్ వైవీపాలెం పోలీసుస్టేషన్ పరిధిలోని నాటు సారా స్థావరాలపై డ్రోన్ కెమెరాతో పోలీసులు దాడులు జరిపారు. ఈ క్రమంలో చెట్టుతొర్రలో దాచిపెట్టిన 9 లీటర్ల నాటు సారాను పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా వీటిని దాచి పెట్టి పారిపోతున్న ఇద్దరు దుండగులను కూడా డ్రోన్ కెమెరా సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్
Visakhapatnam Mayor: విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం
Read latest AP News And Telugu News