Chittoor Liquor Clash: రెండు బెల్ట్ షాపుల మధ్య గొడవ.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Oct 17 , 2025 | 10:50 AM
తక్కువ ధరకే మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపు యజమానిపై దాడికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈ దాడి ఒకరు తీవ్రంగా గాయపడటంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
చిత్తూరు, అక్టోబర్ 17: జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం ఎస్‌ఎస్ కొండ వద్ద రెండు బెల్ట్ షాపుల (Belt Shpps) మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. వైసీపీ వర్గానికి చెందిన బెల్ట్ షాపులో చాలా తక్కువ ధరకే మద్యం లభ్యం కావడంతో జనం ఎగబడ్డారు. బెల్ట్ షాపులో క్వాటర్ బాటల్ మద్యం 70 రూపాయలకే అమ్ముతున్నారు. దీంతో రోజుకు లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. ఈ షాకే మందుబాబులు ఎక్కువగా రావడంతో మరో బెల్ట్ షాపుకు వ్యాపారం గణనీయంగా తగ్గింది. దీంతో ఆ బెల్ట్ షాపు యజమాని రెచ్చిపోయాడు. తక్కువ ధరకే మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపు యజమానిపై దాడికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈ దాడి ఒకరు తీవ్రంగా గాయపడటంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
అయితే విషయం పెద్ద మనుషుల పంచాయితీకి వెళ్లింది. వారు ఇద్దరి మధ్య రాజీ కుదర్చినప్పటికీ సమస్య సద్దుమణగని పరిస్థితి. ములకలచెరువు వద్ద బయటపడ్డ నకిలీ మద్యం ఘటనకు ముందే ఇది చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొలకలచెరువు నకిలీ మద్యం దిగుమతి చేసుకుని తక్కువ ధరకు విక్రయించారానే అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఎస్‌ఎస్ కొండ వద్ద గతంలో ఒక్క వైన్ షాపు మాత్రమే ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మండలంలో నాలుగు షాపులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. లక్కీ డ్రాలో టీడీపీ సానుభూతిపరులకు ఒకటి, మిగతా వైసీపీ సానుభూతిపరులకు రావడంతో బెల్ట్ షాపులు వచ్చాయి. అయితే వ్యాపారంలో పార్టీలు లేవని సిండికేట్‌గా ఏర్పడి షాపులు నడిపించుకుంటున్నారు బెల్ట్ షాపు యజమానులు. అయితే ఎస్‌ఎస్ కొండ వద్ద ఇరు వర్గాలకు చెందినవారు చెరొక బెల్ట్ షాపును ఏర్పాటు చేసుకున్నారు. క్రమేపీ వైసీపీకి చెందిన బెల్ట్ షాప్‌లో రోజులో లక్షపైనే వ్యాపారం నడుస్తుండేది. దీంతో పోటీగా నిర్వహిస్తున్న బెల్ట్స్ షాప్ యజమాని తనకు వ్యాపారం తక్కువ నడుస్తోందంటూ గొడవకు దిగాడు. తీరా ఆ షాపులో తక్కువ ధరతో క్వాటర్ మందు ఇస్తున్నారన్న సమాచారం తెలియడంతో మద్యం ప్రియులు ఆ షాప్‌కు క్యూ కట్టినట్లు బయటపడింది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధరకే ములకలచెరువు నకిలీ మద్యాన్ని అనుమతులు లేని బెల్టు షాపులో అమ్ముతున్నారా అన్నది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
కాసేపట్లో జిమ్ ఓపెనింగ్... కానీ అంతలోనే
Read Latest AP News And Telugu News