Share News

Tree: నేలకొరిగిన భారీ వృక్షం

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:16 AM

చంద్రగిరిలో పట్టణంలో గురువారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. దీంతో కొత్తపేటలోని రోడ్డు పక్కనున్న భారీ చింత చెట్టు నేలకొరిగింది.

Tree: నేలకొరిగిన భారీ వృక్షం
గాలివానకు నేలకొరిగిన భారీ వృక్షం

చంద్రగిరి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): చంద్రగిరిలో పట్టణంలో గురువారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. దీంతో కొత్తపేటలోని రోడ్డు పక్కనున్న భారీ చింత చెట్టు నేలకొరిగింది. ఇది సమీపంలోని విద్యుత్‌ తీగలపై పడటంతో రెండు స్తంభాలు విరిగిపోయాయి. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఓ హోటల్‌ ముందు రేకుల షెడ్డు కూలిపోయింది. జాతీయ రహదారిలో తీగలపై ఫ్లెక్సీలు పడటంతో సాయంత్రం 4 నుంచి రాత్రి 8.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - Apr 11 , 2025 | 01:16 AM