ACB Court Hearing: చెవిరెడ్డి పిటిషన్‌పై విచారణ 21కి వాయిదా
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:22 AM
విజయవాడ జిల్లా జైల్లో ఉన్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన మెడికల్ పిటిషన్‌పై ..

విజయవాడ, జూలై 17(ఆంధ్రజ్యోతి): విజయవాడ జిల్లా జైల్లో ఉన్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన మెడికల్ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు 21వ తేదీకి వాయిదా వేసింది. తనకు వెన్నెముక నొప్పి ఉందని, తిరుపతిలోని స్విమ్స్‌లో ఫిజియోథెరపి చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను న్యాయాధికారి పి.భాస్కరరావు వాయిదా వేశారు. మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న పైలా దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సిట్ పోలీసులు గురువారం కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్