Tirupati: మద్యం మాఫియాలో నన్ను ఇరికించే కుట్ర చేస్తున్నారు..
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:24 PM
లిక్కర్ స్కాంలో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు.

- తప్పుడు వాంగ్మూలం కోసం సిట్ ఒత్తిడి తెస్తోందన్న చెవిరెడ్డి
తిరుపతి: లిక్కర్ స్కాంలో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి(Chevireddy Bhasker Reddy) ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాదులో నివాసమున్న తన ఆత్మీయుడు వెంకటేష్, ఆయన భార్య, ఏడాది వయసున్న కుమారుడిని సిట్ అధికారులు తమ కార్యాలయంలో బంధించి భయపెడుతున్నారని ఆరోపించారు.
సిట్ తయారు చేసిన తప్పుడు స్టేట్మెంట్లో సంతకం పెట్టకుంటే ఏదో ఒక కేసులో ఇరికించి జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తానంటూ వెంకటేష్‌ని ఏఎస్పీ శ్రీనివాస్ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. అప్పటికీ ఆయన సంతకం పెట్టకపోవడంతో ప్రలోభపెడుతున్నట్టు ఆరోపించారు. వెంకటేష్ కుటుంబీకులతో పాటు ఆయనవద్ద పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులనూ తీసుకెళ్లి హింసిస్తున్నారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Read Latest Telangana News and National News