CM Retweet to Anand Mahindra: ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు ఏపీ సీఎం రీట్వీట్.!
ABN , Publish Date - Nov 19 , 2025 | 03:15 PM
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తనను అభినందించిన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారత్ గొప్ప మార్పులోకి అడుగుపెడుతోందని కొనియాడుతూ చంద్రబాబు రీట్వీట్ చేశారు.
ఆంధ్రజ్యోతి, నవంబర్ 19: సోషల్ మీడియా ఎక్స్‌లో ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆనంద్ జీ మంచి మాటలకు ధన్యవాదాలు అంటూ రీట్వీట్ చేశారు ముఖ్యమంత్రి. భారత్ గొప్ప మార్పు దిశగా ముందడుగు వేస్తోందని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సరికొత్త దారులను పాలసీ రూపకల్పనల ద్వారా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ చంద్రబాబు రీట్వీట్ చేశారు.
అంతకముందు.. టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ప్రకృతిలో నిలువరించలేని బలం కలిగిన వ్యక్తి ఈ మనిషి అంటూ సీఎంను ఉద్దేశించి ఎక్స్ వేదికగా కొనియాడారు. దశాబ్దాలుగా తాను కేవలం అభివృద్ధినే చూడటం లేదని, పాలసీలను కూడా వినూత్నంగా రూపొందించడం గమనిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన తన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, తన చుట్టూ ఉన్నవారి సామర్థ్యాన్నీ పెంచగలడంటూ విశాఖ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ వీడియోలో ఆనంద్ మహీంద్రా చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. దీనికి ప్రతిగా తాజాగా ఏపీ సీఎం రీట్వీట్ చేశారు.
ఇవీ చదవండి:
ఇంటి నిర్వహణ కోసం ప్రత్యేక మేనేజర్.. నెలకు జీతం ఎంతో తెలిస్తే..
దొంగ మనసు మార్చిన చిన్నారి.. చూసి తీరాల్సిన వీడియో!