CM Chandrababu Naidu: కేబినెట్ భేటీ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:01 PM
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. అభివృద్ధి పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యావేక్షించాలన్నారు. పేదలందరికీ గృహ సదుపాయం కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. త్వరితగతిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్నారు.
అమరావతి, నవంబర్ 10: రాష్ట్రంలోని పేదలందరికీ గృహ సదుపాయం కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నివాస స్థలం లేని వారందరి అర్హుల జాబితా రూపొందించి అందరికీ హౌస్ సైట్స్ దక్కేలా చూడాలన్నారు. సంవత్సరంలోగా నివాస స్థలం లేని వారికి లబ్ది చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని సూచించారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకునేలా ఇన్చార్జ్ మంత్రులు చొరవ చూపాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం తగదని అన్నారు. త్వరితగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలని సూచించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం నాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రులతో సుధీర్ఘంగా చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
వైజాగ్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ద్వారా యువతకు మనం ఏం చేస్తున్నామో తెలియజేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. పాఠశాలల్లో వాళ్లకు ఎవరికైన ఆసక్తి ఉంటే వాళ్ళు ఈ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ చూసే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం మంత్రులు పనిచేయాలన్నారు. పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు ఉప రాష్ట్రపతి వస్తున్నారని.. పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని సూచించారు. ఈ సమ్మిట్‌కు ప్రెసిడెంట్, ప్రధాని, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, చాలామంది వస్తున్నారని చెప్పారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తుంటే.. ఇన్‌చార్జి మంత్రులు జోక్యం చేసుకుని సరిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ విషయాన్ని కూటమి ఎమ్మెల్యేలకు మంత్రులే వివరంగా చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎజెండాగా పెట్టుకుని ఇంచార్జి మంత్రులు పరిష్కారం చేయాలని ఆదేశించారు. అనంతపురంలో రెవెన్యూ సమస్యలను రెవెన్యూ అధికారులందరూ కూర్చోబెట్టి పరిష్కారం చేశారని గుర్తు చేశారు. అనేక వివాదాలకు సంబంధించి రెండు పార్టీలు రాజీ పడినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు ఒప్పుకోవడం లేదన్నారు. మంత్రులు ఈ విషయమై ఎమ్మెల్యేలందరికీ గట్టిగా చెప్పాలని అన్నారు. ఎర్ర చందనం విషయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఆక్రమణలను తాను హెలికాప్టర్ నుంచి వీడియో తీశానని చెప్పారు. త్వరలోనే ఈ వీడియో రిలీజ్ చేస్తానని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. వైసీపీకి ఎంపీ శ్రీభరత్ స్ట్రాంగ్ వార్నింగ్
తిరుమల లడ్డులో నకిలీ నెయ్యి వాడకంపై లంకా దినకర్ సంచలన వ్యాఖ్యలు