పద్మభూషణ్ బాలయ్యకు సీఎం అభినందనలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:37 AM
పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

అమరావతి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. కళా,సేవా,రాజకీయరంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ‘ఎక్స్’లో చంద్రబాబు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా బాలయ్యకు అభినందనలు తెలిపారు.