Share News

Rayalaseema Drought: సీమ కరువుపై అధ్యయనానికి కేంద్ర బృందం

ABN , Publish Date - Jul 11 , 2025 | 03:52 AM

రాయలసీమ జిల్లాల్లోని కరువు సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చెప్పారు..

Rayalaseema Drought: సీమ కరువుపై అధ్యయనానికి కేంద్ర బృందం

  • కరువు పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు

  • కేంద్ర మంత్రి మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

పుట్టపర్తి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ జిల్లాల్లోని కరువు సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చెప్పారు. ఇందుకోసం ఐసీఏఆర్‌, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి శాస్త్రవేత్తలు, అధికారులతో ఓ ప్రత్యేక బృందాన్ని రాయలసీమకు పంపుతామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గురువారం కరువు పీడిత జిల్లాల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి చౌహాన్‌, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రాయలసీమలో వర్షాభావం, కరువు, వ్యవసాయ రంగ సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి అచ్చెన్నాయుడు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా శివరాజ్‌సింగ్‌ మాట్లాడుతూ.. రాయలసీమ జిల్లాల్లోని కరువు సమస్యకు సత్వర, శాశ్వత పరిష్కారం చూపడానికి దీర్ఘకాలిక ప్రణాళికల అమలుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 03:52 AM