Share News

బడ్జెట్‌ అంచనాల్లో నిజాయితీ లేదు: రాఘవులు

ABN , Publish Date - Mar 02 , 2025 | 05:20 AM

బడ్జెట్‌ అంచనాల్లో నిజాయితీ లేదు’ అని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.

బడ్జెట్‌ అంచనాల్లో నిజాయితీ లేదు: రాఘవులు

విజయవాడ, అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మాటల కోతలు, నిధుల కోతలు తప్ప ప్రజలకు ప్రాధాన్యం లేదు. బడ్జెట్‌ అంచనాల్లో నిజాయితీ లేదు’ అని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ‘పార్లమెంటు సీట్ల పునర్విభజనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన ప్రకటన మోసపూరిం. ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గించబోమన్న మాటల్లో నిజాయితీ లేదు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి అభిప్రాయం మేరకు ఆమోదయోగ్యమైన ప్రక్రియ చేపట్టాలి’ అని రాఘవులు డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 02 , 2025 | 05:20 AM