పీఎస్ఆర్, వంశీలను ఒకే జైలుగదిలో పెట్టాలి: బుద్దా వెంకన్న
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:26 AM
ఎస్‌ఆర్ ఆంజనేయులు, వంశీలు వేర్వేరు నేరాల్లో జైల్లో ఉన్నారు. బుద్దా వెంకన్న వారి ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని డిమాండ్ చేశారు.

విజయవాడ(వన్‌టౌన్), ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): వేర్వేరు నేరాల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ డీఐజీ పీఎ్‌సఆర్ ఆంజనేయులు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను ఒకే జైలు గదిలో పెట్టాలని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్‌ను ఉద్దేశిస్తూ ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. వల్లభనేని వంశీ తనకు జైల్లో ఎవరైనా తోడు కావాలంటున్నాడని, పీఎ్‌సఆర్ ఆంజనేయులు ఎక్కడ ఉన్నా తన పక్కన ఎవరో ఉండాలని కోరుకుంటారని తెలిపారు. కనుక వీరిద్దరినీ జైల్లోని ఒకే గదిలో పెట్టాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బుద్దా వెంకన్న చమత్కరించారు.