Kannappa: కన్నప్ప సినిమాకు షాక్.. బ్రాహ్మణ చైతన్య వేదిక పోరాటం సక్సెస్..
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:19 PM
కన్నప్ప సినిమా (Kannappa Movie) విడుదలకు ముందు బ్రాహ్మణ చైతన్య వేదిక (Brahmin Chaitanya Vedika) చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. ఈ సినిమాలో 13 సీన్లు సమాజంలో అనవసరమైన దృక్పథాలను ప్రదర్శిస్తున్నాయని బ్రాహ్మణ కమిటీ సభ్యులు భావించారు. దీనిపై సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: కన్నప్ప సినిమాపై(Kannappa Movie) బ్రాహ్మణ చైతన్య వేదిక (Brahmin Chaitanya Vedika) చేసిన పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది. ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోంది. ఆయా సీన్లను తొలగించాలని చిత్ర యూనిట్ ను డిమాండ్ చేసింది. మరోవైపు తమను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా సినిమా విడుదల నేపథ్యంలో కన్నప్ప మూవీ సెన్సార్ బోర్డుకు వచ్చింది.
సినిమా వీక్షించిన 11 మంది సభ్యుల కమిటీ.. 13 సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు వాటిని తొలగించి మళ్లీ ప్రివ్యూ ఇవ్వాలని సూచించింది. దీంతో కమిటీ సూచించిన 13 సీన్ల తొలగింపు తర్వాత కన్నప్ప సినిమాకు అనుమతి ఇవ్వనున్నట్లు సెన్సార్ బోర్డు తెలిపింది. దీంతో బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ సెన్సార్ బోర్డుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే బ్రాహ్మణ చైతన్య వేదిక చేసిన పోరాటం ఈ సినిమాకు మేలు చేస్తుందా, లేదా? అనేది వేచి చూడాల్సిందే.
రిలీజ్ ఎప్పుడంటే..
ప్రస్తుతం కన్నప్ప చిత్రం జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించారు. దీంతోపాటు ఈ సినిమాలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రభాస్, మోహన్‌లాల్, బ్రహ్మానందం, సప్తగిరి సహా తదితరులు ఉన్నారు. దీనికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News