Share News

బెట్టింగ్‌ యాప్స్‌పై కఠిన చర్యలు: లోకేశ్‌

ABN , Publish Date - Apr 19 , 2025 | 04:25 AM

బెట్టింగ్‌ యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా, ఈ యాప్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు

బెట్టింగ్‌ యాప్స్‌పై కఠిన చర్యలు: లోకేశ్‌

తిరుమల, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌ యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ ముప్పునకు చరమగీతం పాడటానికి చట్టపరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తామని మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. కొంతకాలంగా బెట్టింగ్‌ యాప్‌లపై ‘నా అన్వేషణ’ యూట్యూబర్‌ అన్వేష్‌ పోరాటం చేస్తున్నాడు. గోవిందా అనే పేరుతో బెట్టింగ్‌ యాప్స్‌ నడుపుతున్నారని, వాటిని అడ్డుకోవాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ను కోరుతూ ఎక్స్‌లో అతను పోస్ట్‌ చేశాడు. దీనిపై మంత్రి లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘బెట్టింగ్‌ యాప్స్‌ జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇక ఇది ఆగాలి. బెట్టింగ్‌ యాప్‌ల బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు ఆ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకోవడమే పరిష్కారం. దేశానికి ఆదర్శంగా నిలిచేలా యాంటీ బెట్టింగ్‌ పాలసీని రూపొందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 04:25 AM