Share News

Hansraj Ahir BC Commission: బీసీల అభ్యున్నతే లక్ష్యం

ABN , Publish Date - Jul 18 , 2025 | 06:34 AM

వెనుకబడిన తరగతుల అభ్యున్నతే లక్ష్యంగా క్రమశిక్షణ, నిబద్ధతతో అధికారులు పనిచేయాలని జాతీయ..

Hansraj Ahir BC Commission: బీసీల అభ్యున్నతే లక్ష్యం
Hansraj Ahir BC Commission

  • జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ హన్సరాజ్‌ అహిర్‌

అమరావతి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన తరగతుల అభ్యున్నతే లక్ష్యంగా క్రమశిక్షణ, నిబద్ధతతో అధికారులు పనిచేయాలని జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ హన్సరాజ్‌ గంగారామ్‌ అహిర్‌ అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం విజయవాడలోని స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లోనూ, ఓ ప్రైవేట్‌ హోటల్‌లోనూ వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు, రోస్టర్‌ అమలు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీపై ఆయన సమీక్ష నిర్వహించారు. ముందుగా సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీపెట్‌) సంస్థ కార్యకలాపాలు, అక్కడ ప్లాస్టిక్‌ కోర్సుల్లో శిక్షణ పొందినవారికి వస్తున్న ఉద్యోగావకాశాల గురించి సీపెట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్ల అమలుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ను చైర్మన్‌ ఆరా తీశారు. బ్యాంకుల్లో రోస్టర్‌ విధానం అమలును యూనియన్‌ బ్యాంక్‌ జోనల్‌ హెడ్‌ సీవీఎన్‌ భాస్కర్‌రావు, రీజినల్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఎంపీ తిలక్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ కె.ప్రియాంకను అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ అందిస్తున్న సేవలు, పోస్టుల వివరాలు, రోస్టర్‌పై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.శాంతాసింగ్‌ చైర్మన్‌కు వివరించారు. రాష్ట్రంలోని 18 వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లు, ఓబీసీ రిజర్వేషన్లు, రోస్టర్‌ అమలు తీరును వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న రిజర్వేషన్లు, రోస్టర్‌ విధానాలు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ గురించి ఆ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్‌ మల్లికార్జునను సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

Updated Date - Jul 18 , 2025 | 06:34 AM