Ayyanna Patrudu: ‘నాకేం సంబంధం’.. జగన్‌పై అయ్యన్న సెటైర్లు..
ABN , Publish Date - Nov 10 , 2025 | 06:29 PM
జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అన్న అయ్యన్న.. అసెంబ్లీకి రాకపోవడంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. సోమవారం నాడు అనపర్తి మండలం కుతుకులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
రాజమండ్రి, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. నాకేం సంబంధం అంటూనే.. జగన్‌పై సెటైర్లు వేశారు. జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అన్న అయ్యన్న.. అసెంబ్లీకి రాకపోవడంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. సోమవారం నాడు అనపర్తి మండలం కుతుకులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదంటూ పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
అయ్యన్న ఏమన్నారంటే..
‘జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదంటూ చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నాను. జగన్ రాకపోతే నాకేమి సంబంధం. సభాపతిగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం నా బాధ్యత. బాధ్యత ప్రకారమే జగన్‌కు మాట్లాడే అవకాశం ఇస్తాం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్ అసెంబ్లీకి వస్తానంటున్నాడు. దేశంలో ఎక్కడా 11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రతిపక్ష హోదాపై జగన్ నిందలు వేయడం తప్పు. ప్రజలే జగన్‌కు 11 సీట్లు ఇస్తే నేనేం చేస్తాను. నేను అసెంబ్లీలో రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటున్నాను.’ అని స్పీకర్ అయ్యన్న చెప్పుకొచ్చారు.
జగన్ వింత వాదన..
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత వైఎస్ జగన్ అసెంబ్లీ వైపు చూసిందే లేదు. ప్రమాణ స్వీకారం సమయంలో మాత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చి వెళ్లారు. ఆ తరువాత సభకు వచ్చిన సందర్భమే లేదు. అదేమంటే.. తనకు ప్రతిపక్ష హోదా కావాలని.. అలాగైతేనే అసెంబ్లీకి వస్తానంటూ వింత వాదనలు చేస్తున్నారు. అయితే, అసెంబ్లీ నిబంధనల ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి లేదు. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు గెలిచిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారంటూ అధికారపక్షం ఎదురు ప్రశ్నిస్తోంది. అయినప్పటికీ.. మొండిపట్టుదలతో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ జగన్ సభకు డుమ్మా కొడుతూనే ఉన్నారు. ఈ వ్యవహారం పొలిటికల్‌గా ఇప్పటికీ హాట్ డిస్కషన్‌గా నడుస్తోంది.
Also Read:
నాయకత్వ మార్పు ఊహాగానాలు.. మీడియాకు ముఖం చేటేసిన సిద్ధరామయ్య
రాజస్తాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ అతడే!