Share News

PSR Anjaneyulu- Madhusudhan: బెయిల్‌ ఇవ్వండి

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:52 AM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మూల్యాంకనంలో ఆక్రమాలు, నిధుల దుర్వినియోగం కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ క్యామ్‌సైన్‌ సంస్థ డైరెక్టర్‌ మధుసూదన్‌(ఏ2) వేసిన పిటిషన్‌ గరువారం హైకోర్టులో విచారణకు వచ్చింది.

PSR Anjaneyulu- Madhusudhan: బెయిల్‌ ఇవ్వండి

  • హైకోర్టును ఆశ్రయించిన పీఎస్ఆర్‌, మధుసూదన్‌

అమరావతి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మూల్యాంకనంలో ఆక్రమాలు, నిధుల దుర్వినియోగం కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ క్యామ్‌సైన్‌ సంస్థ డైరెక్టర్‌ మధుసూదన్‌(ఏ2) వేసిన పిటిషన్‌ గరువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. కేసుకి సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు(ఏ1) బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే వ్యాజ్యానికి నంబరు ఇచ్చేందుకు రిజిస్ట్రీ నిరాకరించారు. దీంతో ఈ వ్యవహారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు ముందుకు వచ్చింది. న్యాయమూర్తి స్పందిస్తూ... ‘అనారోగ్య కారణాలతో ట్రయల్‌ కోర్టు రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. ఆ గడువు ముగియకుండా బెయిల్‌ పిటిషన్‌ ఎలా దాఖలు చేస్తారు?’ అని ప్రశ్నించారు. పీఎ్‌సఆర్‌ తరఫు న్యాయవాది అభయ్‌ సిద్ధాంత్‌ వాదనలు వినిపిస్తూ... ‘పిటిషనర్‌కు బైపాస్‌ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. మధ్యంతర బెయిల్‌ గడువు 27తో ముగుస్తుంది. ఈ నపథ్యంలోనే అత్యవసరంగా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాం’ అని వివరించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పీఎ్‌సఆర్‌ వేసిన పిటిషన్‌కు నంబరు కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మూల్యాంకనంలో ఆక్రమాలకు పాల్పడడంతోపాటు నిధుల దుర్వినియోగం చేశారని పేర్కొంటూ విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు(ఏ1), మధుసూదన్‌(ఏ2)ను పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 20 , 2025 | 04:54 AM