Share News

AP Working Journalists Conference: ఒంగోలులో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:12 AM

ఒంగోలులో 36వ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర మహాసభలు మే మొదటి వారంలో నిర్వహించేందుకు నిర్ణయం. 300 మంది ప్రతినిధులు పాల్గొంటారు, ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేతలను ఆహ్వానించనున్నారు

AP Working Journalists Conference: ఒంగోలులో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు

మే మొదటి వారంలో నిర్వహణ

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలి్‌స్ట(ఏపీయూడబ్ల్యూజే) 36వ రాష్ట్ర మహాసభలను ఒంగోలులో నిర్వహించనున్నారు. మంగళవారం ఒంగోలులోని మల్లయ్యలింగం భవన్‌లో నిర్వహించిన రాష్ట్రమహాసభ సన్నాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహాసభలు వచ్చేనెల మొదటివారంలో నిర్వహించేందు కు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన ఐజేయూ జాతీయ నాయకులతోపాటు ఆయా రాష్ట్రాల ప్రతినిధులు సుమారు 300 మంది మహాసభల్లో పాల్గొంటారని తెలిపారు. మహాసభల ప్రారంభం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు, ముగింపు రోజున ప్రతిపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్‌, మరో జాతీయ కార్యదర్శి ఆలపాటి సురేష్‌, యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు మాట్లాడారు.

Updated Date - Apr 09 , 2025 | 05:12 AM