Share News

B Srinivasarao: 2030 నాటికి వంద శాతం జీఈఆర్‌

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:12 AM

రాష్ట్రంలో 2030 నాటికి వంద శాతం స్థూల నమోదు నిష్పత్తి జీఈఆర్‌ సాధిస్తామని సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు అన్నారు.

B Srinivasarao: 2030 నాటికి వంద శాతం జీఈఆర్‌

  • ఎన్‌ఈపీ సదస్సులో సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు

అమరావతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2030 నాటికి వంద శాతం స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్‌) సాధిస్తామని సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుతం జీఈఆర్‌ 97 శాతంగా ఉందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) ఐదో వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ లెర్నింగ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌(లీప్‌) ద్వారా పాఠశాలల్లో విద్యా స్వరూపాన్ని మారుస్తున్నామన్నారు. వంద శాతం జీఈఆర్‌ సాధించేందుకు సెకండరీ గ్రేడ్‌ విద్యను పునర్‌వ్యవస్థీకరిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకంతో పాటు పీఎంశ్రీ, పీఎం పోషణ్‌, క్వాలిటీ ఇనిషియేటివ్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌, వృత్తి విద్య, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, మెగా పీటీఎం, బాలికా రక్ష, పాల్‌ కార్యక్రమాలను ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఇటీవల మెగా పీటీఎం గిన్నిస్‌ రికార్డు సాధించిందని పేర్కొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 05:12 AM