AP High Court: అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని ఆదేశించలేం
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:28 AM
హైకోర్టు ఉద్యోగాల భర్తీ విషయంలో అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని ఆదేశించలేమని తేల్చింది. నిబంధనలు, వయోపరిమితి పెంపు నియామక అథారిటీ పరిధిలోని అంశం అని స్పష్టం చేసింది. వైఎస్సార్ కడప జిల్లాలో ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీ విషయంలో ఈ అభ్యర్థన కొట్టివేసింది

అది పూర్తిగా అధికారుల పరిధిలోని వ్యవహారం: హైకోర్టు
అమరావతి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ఉద్యోగల భర్తీ విషయంలో అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని న్యాయస్థానాలు అదేశించలేవని హైకోర్టు తేల్చిచెప్పింది. నిబంధనల రూపలక్పన, వయోపరిమితి పెంపు పూర్తిగా నియామక అథారిటీ పరిధిలోని వ్యవహారమని పేర్కొంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆర్ట్ ఎడ్యుకేషన్ పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీ విషయంలో గరిష్ఠ వయోపరిమితి పెంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవల తీర్పు ఇచ్చారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆర్ట్ ఎడ్యుకేషన్ పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీ విషయంలో గరిష్ఠ వయోపరిమితి పెంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎంజేహెచ్ వినయ్‌బాబు, మరో ముగ్గురు 2012లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల తుదివిచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పిటిషన్‌ను కొట్టివేశారు.