Share News

ఏపీడీఏఎస్‌సీఏఏసీ అప్పటి చైర్మన్‌ను ప్రతివాదిగా చేర్చండి: హైకోర్టు

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:01 AM

ఏపీడీఏఎస్‌సీఏఏసీ చైర్మన్‌ జి. కోటేశ్వరరావు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని పిటిషనర్‌ ఆరోపణ.హైకోర్టు ఆయనను ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించి విచారణను వాయిదా వేసింది.

ఏపీడీఏఎస్‌సీఏఏసీ అప్పటి చైర్మన్‌ను ప్రతివాదిగా చేర్చండి: హైకోర్టు

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): పేషీ సిబ్బందికి జీతాల చెల్లింపు పేరుతో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల అసిస్టెన్స్‌ కార్పొరేషన్‌ (ఏపీడీఏఎ్‌ససీఏసీ) చైౖర్మన్‌ జి.కోటేశ్వరరావు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని వచ్చిన ఫిర్యాదును అప్పటి ముఖ్యకార్యదర్శి, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏఆర్‌ అనురాధ అర్ధాంతరంగా మూసివేశారని, ఆమెపై చర్యలు తీసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన సిటిజన్‌ ట్రస్ట్‌ ప్రెసిడెంట్‌ కె.దామోదరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ పిల్‌ బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది జె.సుధీర్‌ వాదనలు వినిపించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అప్పటి చైర్మన్‌ ఎవరు? ఆయనను ప్రతివాదిగా చేర్చారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది బదులిచ్చారు. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం అప్పటి ఏపీడీఏఎస్‌సీఏఏసీ చైర్మన్‌ను ప్రతివాదిగా చేర్చాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.

Updated Date - Apr 17 , 2025 | 04:02 AM