Share News

AP Govt. Employees: DA బకాయిల ఉత్తర్వులు సవరిస్తూ GO జారీ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల హర్షాతిరేకాలు

ABN , Publish Date - Oct 21 , 2025 | 10:30 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల DA విడుదలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన GO నంబర్ 60, 61 లలో మార్పులు చేస్తూ.. జీవో 62 రిలీజ్ చేసింది చంద్రబాబు సర్కారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం..

AP Govt. Employees:  DA బకాయిల ఉత్తర్వులు సవరిస్తూ GO జారీ..  ఏపీ  ప్రభుత్వ ఉద్యోగుల హర్షాతిరేకాలు
AP DA arrears GO 62

అమరావతి, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల DA విడుదలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన GO నంబర్ 60, 61 లలో మార్పులు చేసింది చంద్రబాబు సర్కారు. ప్రభుత్వ ఉద్యోగులకు నేటి నుంచి ఏడాది లోపు మూడు వాయిదాలలో DA బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ఉద్యోగుల GPF ఖాతాల్లో జమ చేయాలని GO లో సవరణలు తీసుకొచ్చారు. CPS ఉద్యోగులు, పెన్షనర్ లకు ఏడాది లోపు మూడు వాయిదాలలో చెల్లించాలని ఆదేశాలిచ్చారు.


దీనికి సంబంధించి కొంచెంసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం కొత్త GO విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన DA బకాయిలు ఉత్తర్వులను సవరిస్తూ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ GO నంబర్ 62 ను విడుదల చేశారు. తాము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే సవరణ GO ఇచ్చినందుకు APNGO సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

విభేదాల వేళ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన కిరణ్ మజుందార్

12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 21 , 2025 | 10:30 PM