Share News

Agrigold Asset Auction: అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి కమిటీలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:40 AM

అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. సీఎస్‌ చైర్మన్‌గా ఉన్న రాష్ట్ర కమిటీకి కీలక శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా నియమితులయ్యారు

Agrigold Asset Auction: అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి కమిటీలు

రాష్ట్ర కమిటీకి చైర్మన్‌గా సీఎస్‌: రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం నిర్వహించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, సమాచార పౌరసంబంధాల శాఖ కార్యదర్శి, ఐటీ సెక్రటరీ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ద్వారకా తిరుమలరావు సభ్యులుగా ఏర్పాటైన రాష్ట్రస్థాయి కమిటీలో ఏపీ సీఐడీ డీజీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇందులో ఆర్థిక నిపుణుడు కుటుంబరావు, అగ్రిగోల్డ్‌ తరఫున ప్రతినిధికి అవకాశం కల్పించింది. జిల్లా కమిటీల్లో జాయింట్‌ కలెక్టర్‌ లేదా ఆర్డీవో, జిల్లా రిజిస్ట్రార్‌, డీపీఆర్‌వో, జిల్లా ఈ-ఆక్షన్‌ అధికారి, సీఐడీ అదనపు ఎస్పీ తదితరులు ఉంటారు.


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 04:42 AM