Andhra Pradesh Tourism Policy: భూ కేటాయింపులకు ప్రత్యేక కమిటీ
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:47 AM
పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు..

కమిటీ చైర్మన్‌గా ఏపీటీడీసీ ఎండీ
అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు భూములు కేటాయింపు కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. టూరిజం పాలసీ ప్రకారం భూముల కేటాయింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉండటంతో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీటీడీసీ ఎండీ కమిటీకి చైర్మన్‌గా ఉంటారు. టూరిజం అథారిటీ సీఈవో కో-చైర్మన్‌గా, ఏపీటీడీసీ ఈడీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వీరితో పాటు మరో ఎనిమిది మందిని కమిటీలో మెంబర్లుగా నియమించారు. ఈ కమిటీ పారదర్శకంగా బిడ్డింగ్ నిర్వహించి, అర్హత కలిగిన కంపెనీలకు భూములు కేటాయించేలా చూడాలి. టూరిజం పాలసీలోని భూ కేటాయింపుల నిబంధనల ప్రకారమే బిడ్డింగ్ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్