Mother attacked on Son: ఏపీలో దారుణ హత్య.. తల్లే హత్య చేయించింది!
ABN , Publish Date - Nov 10 , 2025 | 09:40 PM
గుడిసివారిపల్లిలో మూడు రోజుల క్రితం జరిగిన జయప్రకాష్ రెడ్డి (27) దారుణ హత్య ఘటనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కుమారున్ని కన్న తల్లే హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. తల్లి టి.శ్యామలమ్మతోపాటు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అన్నమయ్య, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గుడిసివారిపల్లిలో మూడు రోజుల క్రితం జరిగిన జయప్రకాష్ రెడ్డి (27) దారుణ హత్య ఘటనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కుమారున్ని కన్న తల్లే హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. తల్లి టి.శ్యామలమ్మతోపాటు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి టి. శ్యామలమ్మ, ఏ.మహేష్, జి. భాను ప్రకాష్, పి. సాయి గణేష్, సి. ఆకాష్, పి. కిరణ్, సి. రాహుల్ ప్రమోద్, కె. హరిప్రసాద్ లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఆస్తి, ఇతర విషయాలపై తనను వేధించడం పట్ల విరక్తి చెందిన తల్లి.. కిరాయి వ్యక్తుల చేత కుమారుడు జయప్రకాష్ రెడ్డిని హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం ఊరికి సమీపంలో జయప్రకాష్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహీంద్ర ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలిలో దొరికిన ఆధారాలతో దర్యాప్తు చేశారు. తొలుత హత్య వెనుక తల్లి ప్రమేయమున్నట్లు పోలీసులు అనుమానించారు.
అటు ఏపీలో మరో దారుణ ఘటన జరిగింది. విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నం ప్రాంతం ఇంద్రనగర్ లో మహిళ శ్యామల (28) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దిలీప్ కుమార్ అనే వ్యక్తితో శ్యామలకు వివాహం జరిగి సంవత్సరకాలం అయింది. అయితే పిల్లలను కనే విషయంలో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల సమయంలో భర్త దిలీప్ కుమార్ ఇంటికి వచ్చి చూసే సరికి శ్యామల ఉరివేసుకొని కనిపించింది. ఒక్కసారిగా షాక్ కు గురైన దిలీప్.. పోలీసులకు సమాచారం అందించారు. భర్త దిలీప్ వేధింపులు తాళలేక తమ కూతురు శ్యామల ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసులకు మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
వందేమాతరం అందరిలో దేశభక్తిని రగిలించింది: సీఎం చంద్రబాబు
‘నాకేం సంబంధం’.. జగన్‌పై అయ్యన్న సెటైర్లు..