Share News

Vangalapudi Anita: జగన్‌రెడ్డిది నీచ చరిత్ర

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:04 AM

రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్‌రెడ్డిది

Vangalapudi Anita: జగన్‌రెడ్డిది నీచ చరిత్ర

పాయకరావుపేట, జూలై 16(ఆంధ్రజ్యోతి): ‘రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్‌రెడ్డిది. రప్పా రప్పా అంటున్న నేతలను సమర్థిస్తున్న ఆయన మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదు’ అని మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. బుధవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ... ‘సీఎం చంద్రబాబును రీకాల్‌ చేస్తామని జగన్‌ అనడం రాష్ట్ర ప్రజలను, ప్రజలు ఇచ్చిన తీర్పును రీకాల్‌ చేయడమే. ఎమ్మె ల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానాలు తప్పుబట్టాయి.కానీ జగన్‌కు తప్పులా కనిపించడంలేదు.’ అని అన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 04:04 AM