DEEN SAROJINI DEVE: సేవను అలవర్చుకోవాలి
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:10 AM
విద్యార్థి దశ నుంచే సమాజసేవ అలవర్చుకోవాలని ఆచార్య ఎనజీ రంగా వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డీన డాక్టర్ సరోజినీ దేవి అన్నారు.

మడకశిర రూరల్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచే సమాజసేవ అలవర్చుకోవాలని ఆచార్య ఎనజీ రంగా వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డీన డాక్టర్ సరోజినీ దేవి అన్నారు. కళాశాల ఆధ్వర్యంలో వారం రోజులగా ఆర్. అనంతపురం గ్రామాలో ఎనఎ్‌సఎ్‌స క్యాంపును నిర్వహించారు. ఆదివారం ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల పాటు విద్యార్థులు ప్రజలతో మమేకమై వారి కష్టాసుఖాలను తెలుసుకున్నారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యార్థులు బాగా చదివి మంచి శాస్ట్రవేత్తలు కావలని పిలుపునిచ్చారు. సర్పంచు అంజనమ్మ, ప్రోగాం ఆఫీసర్ మురళీకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.