Share News

VHP: హిందువులపై దాడిచేసిన వారిని శిక్షించాలి

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:10 AM

రాయచోటిలో 4వ తేదీన వీరభద్రస్వామి ఉత్సవం సమయంలో హిందువులపై దాడిచేసిన వారిని అరె్‌స్టచేసి కఠినంగా శిక్షించాలని వీహెచపీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

VHP: హిందువులపై దాడిచేసిన వారిని శిక్షించాలి
VHP leaders holding a rally in the town

పెనుకొండ, మర్చి 10(ఆంధ్రజ్యోతి): రాయచోటిలో 4వ తేదీన వీరభద్రస్వామి ఉత్సవం సమయంలో హిందువులపై దాడిచేసిన వారిని అరె్‌స్టచేసి కఠినంగా శిక్షించాలని వీహెచపీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. సోమవారం వివిధ ప్రాంతాలకు చెందిన విశ్వహిందూపరిషత నాయకులు, హిందూసంఘాల నాయకులు, యువకులు, ప్రజలు పెద్దఎత్తున హాజరై పాల్గొన్నారు. స్థానిక మిట్ట ఆంజనేయస్వామి ఆలయం నుంచి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, రాయచోట అర్బన ఎస్‌ఐను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఏఓకు సత్యసాయిజిల్లా కలెక్టరేట్‌ ఏఓకు వినతిపత్రం అందించారు. వీహెచపీ జిల్లా అధ్యక్షుడు బొక్సంపల్లి రామక్రిష్ణ, కార్యదర్శి పులిచెర్ల వేణుగోపాల్‌, గోశాయి హరిప్రసాద్‌, వేదవ్యాస్‌, రామాంజనేయులు, సుధాకర్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్దనరెడ్డి, కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, కోన కన్వాశ్రమ స్వామీజీ దత్తనందగిరి, హరీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:10 AM